Ration Card Latest News: కొత్త రేషన్ కార్డులు విధానాలు ఇవే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త సీఎం సూచనలు చేసారు.
తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కరలేదు.దాదాపుగా 10 సంవత్సరాల కాలం తరువాత ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల గురించి ప్రస్తావన తీసుకు వచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన అధ్యక్షతన మొన్న 20 వ తారీఖున క్యాబినెన్ట్ సమావేశం నిర్వహించారు.
Ration Card Latest News
ఆ క్యాబినెన్ట్ సమావేశంలో అక్టోబర్ 2 నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవాలి అని ముఖ్య మంత్రి అధికారులకు తెలియజేసారు. దీంతో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి అని నమ్మకం కలిగింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండాలి అనే దానిపై సీఎం తో సహా మిగతా మంత్రులు మరియు అధికారులు ఆలోచిస్తున్నారు.గతంలో రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డులను డిజిటల్గా ఇస్తాం అని తెలిపారు.అంతే కాకుండా ఈ విధానం ద్వారా దాదాపు రేషన్ షాపుల్లో జరిగే స్కాములకు స్వస్తి పలుకొచ్చు అని అన్నారు.

మల్లి సమీక్ష
రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర పథకాలు కూడా రావడం లేదు కాబట్టి రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగ పడేలా రేషన్ కార్డును డిజైన్ చేస్సాయాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరనయించిందిదీనికోసం ఫామిలీ డిజిటల్ కార్డుకు రూపకల్పన చేయబోతుంది.కార్డులో అమర్చబోయే చిప్/scan కోడ్ ద్వారా లబ్ది దారులు చౌక దేపాలనుంచి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడంతో పాటు ఆరోగ్య శ్రీ ఇతర సంక్షేమ పథకాల dwra లబ్ది పొందే అవకాశం ఉంది.
ఈ తరహా కొత్త కార్డులు ఎలా ఉండాలి అనేదాని పై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజా నరసింహ ,ఆహార సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరియు సంభందిత శాఖల మంత్రులు పాల్గొన్నారు.
కుటుంభంలో కొత్త సభ్యుల చేరినప్పుడు లేదా వారి పేర్లను తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ వ్యవస్థను తీర్చి దిద్దాలని రేవంత్ సూచించారు.దీనికి సంబంధించి సమగ్ర నివేదిక పూర్తి చేయాలనీ సంభందిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.
ఇప్పటికే ఈ విధమైన డిజిటల్ కార్డులు రాజస్థాన్,హర్యానా,కర్ణాటకల్లో అమలులో ఉన్నాయి. అధికారులను ఆయా రాష్ట్రాల్లో పరియటించి వాటిపై అధ్యనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను ఫైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించేలా పనులు నిర్వహించాలి అని అన్నారు.
రాష్ట్రంలో గల ప్రతి నియోజకవర్గాల్లోన్నీ పరిధుల్లో ఉన్న ఒక పట్టణం మరియు ఒక గ్రామాన్ని ఏ ఫైలెట్ పోజెక్టులో భాగం చేసుకొని అక్కడ వంద శాతం ప్రతి కుటుంబానికి ఈడిజిటల్ కార్డ్స్ అందించాలి అని తెలిపారు. అర్హులందరికీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్.మనం అందిస్తున్న ఈ డిజిటల్ కార్డులో కుటుంభంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలని తెలిపారు.వారు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ,ఎక్కడ నివసిస్తున్న రేషన్ ,ఆరోగ్య సేవలు అందేలా చూడాలని చెప్పారు.
కుటుంభంలో ఉన్న ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫయిలెను కూడా ఈ కార్డుల్లో పొందుపర్చాలి అని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని ఎప్పటిక్కప్పుడు ఉపాదాటే చేసుకోవడం,డాక్టర్స్ ఇచ్చిన హెల్త్ రిపోర్టులను డిజిటల్ రూపంలో ఈ హెల్త్ ప్రొఫైల్లో పొందుపర్చాలని సూచించారు.