Pradhan Mantri Krishi Sinchayee Yojana : ‘రైతులకు’ ఉచితంగా పంటలకు నీరు 2024

Pradhan Mantri Krishi Sinchayee Yojana : ‘రైతులకు’ ఉచితంగా పంటలకు నీరు 2024

రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చాల పధకాలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రైతులకు ఆర్ధిక భరోసా ఇవ్వడమే కాకుండా రైతులకు అధిక దిగుబడిని అందించే పథకాలు కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు కేంద్రం అందిస్తున్న కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఆ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం

Pradhan Mantri Krishi Sinchayee Yojana

పథకం పేరు :

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. ఈ పథకాన్ని 2015లో ప్రధాన మంత్రి ఈ పథకాన్ని అమలు చేశారు .

పథకం యొక్క ముఖ్య ఉద్దేశం

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క రైతు పంట చేలకు మరియు పంట పొలాలకు నీరు అందించడం.దీని కోసం కేంద్రం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింట్ ఇరిగేషన్ కు సంబంధించి అవగాహనా సదస్సులను నిర్వహిస్తోమది.ఈ పథకం డిసెంబర్ 15 2021న పొడిగించడం జరిగింది.2026 వరకు ఈ పథకానికి రైతులు అప్లై చేసుకోవచ్చు.ఈ పథకం కోసం కేంద్రం రెండు కమిటీ లను అమలు చేసింది అవి
1. నేషనల్ స్టీరింగ్ కమిటీ

  • నేషన్ స్టీరింగ్ కమిటీ కి ప్రధాన మంత్రి చైర్మన్ గా ఉన్నారు.
  • ఈ కమిటీ పథకానికి సంభంధించిన నియమ నిబంధనలను తయారు చేసి ఇక్క్యూటివ్ కమిటీ కి పుంపిస్తుంది.

2. నేషనల్ ఇక్క్యూటివ్ కమిటీ

  • ఈ కమిటీ కి నీతి ఆయోగ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ,ఛైర్మన్స్ గా ఉన్నారు.
  • స్టీరింగ్ కమిటీ ఇచ్చిన నియమాలను తూచా తప్పకుండ అమలు అయ్యే విధంగా ఈ కమిటీ చూస్తుంది.

ఈ ఒక్క పథకం ద్వారా అమలు అయ్యే కొన్ని పథకాలు

  1. వాటర్ షెడ్ పథకం
  2. సత్వర సాగు నీటి పథకం
  3. హర్ ఖేత్ కో ఫణి
  4. ఫర్ డ్రాప్ మోర్ క్రాఫ్
    పథకాలు ఈ పథకం కింద అమలు అవుతున్నాయి .ఈ పథకం కోసం 93 కోట్ల వ్యయాన్ని అంచనాగా వేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ పథకాన్ని మూడు మంత్రిత్వ శాఖలు ఏకధాటిగా నిర్వహిస్తున్నాయి.

=> వ్యవసాయ మంత్రిత్వ శాఖా
=> గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖా
=> జల శక్తి మంత్రిత్వ శాఖా

PMKSY

ఈ పథకం రైతుకు కల్పిస్తున్న ప్రయోజనం

ప్రతి రైతుకు పొలంలో ఉన్న బావులకు పూడిక తీసి నీటిని అందజేయడం,కాలువల ద్వారా నీటిని అందించడం,నీటిని నిల్వ చేయడం, డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింట్ ఇరిగేషన్ లపై అవగాహనా కల్పిస్తుంది. అలాగే కొత్త పద్దతుల ద్వారా వ్యవసాయానికి నీరు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం.భూ గర్భ జలాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి బోరు బావుల ద్వారా నీటిని వెలికి తీసి రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. దీని ద్వారా 40 -50 % వరకు నీటిని ఆదా చేయవచ్చు.

ఈ పథకాన్నికి అర్హులు

ప్రతి రైతు అంటే భూమితో సంభంధం లేకుండా రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.అందరు రైతులు అర్హులే.

ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంతే కావలసిన పత్రాలు

PMKSY
PMKSY
  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు
  3. బ్యాంకు పాస్ బుక్
  4. ఇంటి దరఖాస్తులు(ఇంటి పట్టా)
  5. మొబైల్ నెంబర్
  6. పాస్ ఫోటో
  7. పట్టా పాస్ బుక్
  8. కాస్ట్ సర్టిఫికెట్
    ఆన్లైన్ ద్వారా ఈ వెబ్సైటులో https://pmksy.nic.in రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖా మీ అప్లికేషన్ ను పరిశీలించి మీకు నీటిని అందిస్తుంది.అలాగే డ్రిప్ ఇరిగేషన్,స్ప్రింట్ ఇరిగేషన్ గురించి అవగాహనా కలిపిస్తారు.

Leave a Comment