Family Digital Ration Cards 2024 : డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనాలు ఏంటి?

Photo of author

By Admin

Family Digital Ration Card 2024 : డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనాలు ఏంటి?

తెలంగాణలో ముగిసిన కుటుంబ రేషన్ కార్డు సర్వే త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది.

Family Digital Ration Card

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల గురించి ఏ విషయం తేల్చకుండా ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డులను అమలు చేయడం కోసం సర్వే నిర్వహించారు ఈ సర్వే ను అక్టోబర్ మూడున మొదలుపెట్టి 7న ముగిస్తామని సికింద్రాబాద్ వేదికగా జరిగిన సభలో చెప్పడం జరిగింది మరి ఈ డిజిటల్ రేషన్ కార్డు ఎలా పనిచేస్తుంది దీనికి ఎవరు అర్హులు సర్వేలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాల్సి ఉంటుందా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.

సర్వే ఫార్మ్ లో ఏం వివరాలు ఉన్నాయి?

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు ఒక కార్డుతోనే అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే దిశగా ప్రయాణిస్తూ ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరుతో రేవంత్ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందుబాటులోకి తేనుంది దీనికోసం అని 119 నియోజకవర్గాల్లో 238 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని ఈనెల 3 నుండి 7 వరకు గ్రామ అభివృద్ధి అధికారులు రెవెన్యూ అధికారులు ఆరోగ్య అధికారులు ఈ సర్వేలో పాల్గొని ఫ్యామిలీ రేషన్ కార్డులను అప్డేట్ చేస్తూ వచ్చారు.

సికింద్రాబాద్లో జరిగిన మీటింగులో సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వేకు సంబంధించి సర్వే ఫామ్ విడుదల చేయడం జరిగింది. ఈ సర్వేలో అధికారులు ఏమి అడిగారు అనేది ఒకసారి చూసుకుందాం

  • ఈ సర్వేలో కొన్ని గ్రామాలను మాత్రమే పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.
  • ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి సర్వే ఆఫీసర్ వెళ్లి తమ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.
  • మహిళను యజమానిగా గుర్తిస్తూ సర్వే ఫామ్ మొదలవుతోంది .
  • యజమాని కుటుంబ పెద్ద ఏం పని చేస్తాడు.పిల్లలు ఎంతమంది వారు ఏం పని చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు పెళ్లి అయ్యిందా లేదా ఒంటరిగానే ఉంటున్నారా.
  • పెళ్లి అయితే వేరు కాపురం పెట్టి ఉంటున్నారా.
  • ఒకవేళ వేరుగా ఉంటున్న వారికి కొత్త రేషన్ కార్డు కనుక లేకపోతే వారికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే పనిలో అయితే ప్రభుత్వం ఉంది .
  • కుటుంబంలోని వారికున్న ఆరోగ్య సమస్యలు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. వారు ఎలాంటి పథకాలను ఇప్పటివరకు పొందారు. లాంటి వివరాలను కూడా అధికారులు ఆడ్ చేయనున్నారు.
  • కుటుంబంలోని వారిని ఆడ్ చేయవలసి వస్తే వారి యొక్క వివరాలను సేకరించి సర్వే ఫామ్ లో అయితే రానున్నారు.
  • అలాగే ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనేది కూడా సర్వే ఫార్ములా అయితే మెన్షన్ చేయనున్నారు.
  • ఒకవేళ ఆ కుటుంబం యొక్క ఫోటో తీసుకోవాల్సి వస్తే మాత్రం కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం కచ్చితంగా ఫోటోకి ఉండవలసి ఉంటుంది.
  • ఒకవేళ సర్వేలో అన్ని పత్రాలు సరిగా ఉంటే అంటే కొత్తవారు లేకుండా పాత వారే ఉంటే ఆ కార్డుని డిజిటల్ గా మార్చనున్నారు అంటే కొత్తవారు లేకుండా పాత వారే ఉంటే ఆ కార్డుని డిజిటల్ గా మార్చనున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబాలే కాకా సంపన్న కుటుంబాలు కూడా ఈ రేషన్ కార్డులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇక చాలామంది పేద ప్రజలకు రేషన్ కార్డులు లేవని కేవలం ఈ రేషన్ కార్డులను సంక్షేమ పథకాల కోసం మాత్రమే అప్లై చేసుకుంటున్నారు అని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది మరి ఈ డిజిటల్ రేషన్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలను ఒకసారి చూసుకున్నట్లు అయితే:-

కార్డు యొక్క ప్రయోజనాలు 

సికింద్రాబాద్ వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

  • ఈ రేషన్ కార్డు ద్వారా రైతు బీమా, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, మహాలక్ష్మి, ఉచిత బస్సు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఒక్క కార్డు ద్వారా అయితే సేవలను పొందవచ్చు అని తెలిపారు.
  • ప్రతి పథకంలో కొత్త ధ్రువపత్రాలు ఇవ్వకుండా ప్రతిసారి కొత్త ప్రాబ్లం రాకుండా ఒక క్లిక్ తోనే పూర్తి సమాచారం అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ రేషన్ కార్డు ద్వారా పొందవచ్చు.
  • అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు 30 శాఖలు 30 అప్లికేషన్లో తీసుకోవడం ద్వారా వివిధ సమస్యలు తలెత్తుతూ ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.

Leave a Comment