Guest Lecturers Jobs : గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ 2024

Photo of author

By Admin

Guest Lecturers Jobs : గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ 2024

రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇటీవల జిల్లా కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జిల్ల deo కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి వి.భానునాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల వివరాలను చూసుకుంటే సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎకానిమిక్స్‌, తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఎంపీహెచ్‌ఓడబ్ల్యూ, కోదాడ ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, నేరేడుచర్ల ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఏసీపీ కోర్సు, మ్యాథ్స్‌, హుజూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌, నెమ్మికల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎకనామిక్స్‌ సబ్జెక్టులకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

వీరికి సంభందించి విద్య అర్హతలను గమనిస్తే 

గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి పీజీలో 50శాతం కనీస విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. మెరిట్‌ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని తెలిపారు.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు

అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 సాయంత్రం వరకు సూర్యాపేట డీఐఈఓ కార్యాలయంలో ఐడీఓసీ కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే deo ఆఫీసులో అడగాలని సూచించారు.

కావలసిన ద్రువ పత్రాలు

2024-25 విద్యా సంవత్సరానికి ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.అప్లై చేసుకునేటపుడు అభ్యర్థులు దరఖాస్తు వెంట

  • విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు
  • కులం
  • స్టడీ
  • స్థానికత ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నా రు.

పోస్టుల సంఖ్య

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 8 పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు తమ అర్హత పత్రలను తీసుకుని జిల్ల DEO కార్యాలయం లోని IDOC కలెక్టర్ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని భను నాయక్ తెలిపారు.అప్లై చేసుకునే అభ్యర్థులకు నోటిఫికేషన్ పైన ఏదైనా సందేహాలు ఉంటే deo ఆఫీసులో అడగాలని తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో ఆరుకా ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి 8 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కేంద్రం. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకుని తమ వెంట దరఖాస్తు తో పాటు కావలసిన ధృవ పత్రాలను సమర్పించాలని వి భాను నాయక్ తెలిపారు.సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జిల్ల deo కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

గమనిక: మరిన్ని వివరాల ఇప్పుడే మన వెబ్సైట్ నీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.మీ సహచరులకు తెలియజేయండి.

Leave a Comment