TG 4 schemes selection through gramasabha: లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని: డిప్యూటీ సీఎం భట్టి

Photo of author

By Admin

TG 4 schemes selection through gramasabha: లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని: డిప్యూటీ సీఎం భట్టి 

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం.

ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవని తేలింది. వీటిలో 18.68 లక్షల ఫ్యామిలీలకే సొంత స్థలం ఉంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఆర్థిక సాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడతలవారీగా రూ.5లక్షల చొప్పున మంజూరు చేయనుంది.రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.

అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదని తెలిపారు. ఖమ్మం(D) బనిగండ్లపాడులో మాట్లాడుతూ ఏ లిస్టు అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులూ నమ్మొద్దన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతులు లేకుండా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు.

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Comment