America 47 President Donald Tromp Oath taking:డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం 2025
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ ఆ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. టిక్ టాక్ తిరిగి అందుబాటులోకి వచ్చిందని విక్టరీ ర్యాలీలో తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పలకడమే కాకుండా మధ్య ఆసియాలో నెలకొన్న అనిశ్చితిని నియంత్రిస్తానని తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానని పేర్కొన్నారు.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని రోటుండా ఇండోర్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సారథ్యంలో కొత్త ప్రభుత్వ వ్యవస్థను నిర్మిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. అనేక మార్పులను చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు మస్క్ తెలిపారు. విక్టరీ ఇక్కడి నుంచే మొదలైందన్నారు. శతాబ్దాల పాటు అమెరికాను పటిష్ఠంగా మార్చేందుకు పునాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని నినదించారు.తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50శాతం వాటా పొందేందుకు అనుమతి ఇస్తే ఆ యాప్పై బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. కాగా మరికొన్ని గంటల్లో ట్రంప్ US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక ఈ యాప్ US యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అక్కడి సుప్రీంకోర్టు టిక్టాక్ను నిషేధించిన విషయం తెలిసిందే.సుప్రీంకోర్టు ఆదేశాలతో సేవలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. కాగా ఈ యాప్ అమెరికా యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన ‘బైట్ డాన్స్’ ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అగ్రరాజ్యం ఆరోపణ. చైనా కాకుండా అమెరికా కేంద్రంగా పని చేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు ‘బైట్ డాన్స్’ అంగీకరించలేదు.
అమెరికాలో టిక్టాక్ బ్యాన్ అంశాన్ని తాను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ చెప్పారు. అది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమన్నారు. అయితే టికాకా్ను USలోకి అనుమతించినా చైనాలో Xకు ఎంట్రీ ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. కచ్చితంగా మార్పు రావాల్సి ఉందని Xలో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల అమెరికాలో టిక్టాక్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.