Telangana Traffic Rules: నిబంధనలు పటించకుంటే లైసెన్సు రద్దు
తెలంగాణలో ప్రయాణిస్తున్న మోటర్ వాహనాలకు పొన్నం ప్రభాకర్ బ్యాడ్ న్యూస్ రూల్స్ పాటించకుంటే వారి పేరుపై లైసెన్స్ రద్దుకు నిర్ణయం.
Telangana Traffic Rules
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో ప్రజలను హదలెత్తిస్టు వస్తోంది. మొన్నటివరకు హైడ్రా పేరుతో అయితే కట్టిన భవనాలను ఇండస్ట్రీలను కూల్చుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి వారిపై కోరడ విదిలించింది. ఎవరైతే సక్రమంగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించరో వారికి లైసెన్సు ఇవ్వకపోవడంతో పాటు వారిపై ఉన్నటువంటి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ఇంకా ఎప్పుడు కూడా వారి పేరుపై బండి కొనుక్కోవడానికి వీలు లేకుండా చేస్తామని తెలిపారు.
నిబంధనలు పాటించని వాహన దారుల యొక్క లిస్సెన్స్ రద్దు చేయడంతో పాటుగా ఇప్పటికే వారి పేరు మీద ఉన్న వాహనాలను సీజ్ చేయడం మరియు ఇంకెప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు మీద వాహనాలను కొనుగోలు చేయడం (రిజిస్ట్రేషన్) జరగదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుపడం జరిగింది.ఇప్పటికే నిబంధనలు అతిక్రమించిన 8 వేల మంది లైసెన్సులు రద్దు చేయమని కేంద్రం సారథ్యం వహిస్తున్న సారథి పోర్టల్ లో తెలంగాణ ప్రభుత్వం చెరబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గురించి తెలుసుకోవడం కోసం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలపడం జరిగింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల గురించి తెలపడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిడెంట్ జోన్లను గుర్తించే పనిలో ఉందని పాఠశాలలో పిల్లలకు కూడా రోడ్డు ప్రమాదాల గురించి వివరించే కార్యక్రమాలు మొదలు పెడతామనీ పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. వచ్చే నెలలో పిల్లలకు రోడ్డు భద్రత పై వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలోనే వెహికల్స్ స్క్రాపింగ్ చట్టాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక,మహారాష్ట్రలో వెహికల్స్ స్క్రాపింగ్ చట్టం గురించి అధ్యయనం చేసిన తర్వాత ఈ వెహికిల్ స్క్రాపింగ్ చట్టాన్ని రాష్ట్రంలోకి తీసుకురానున్నట్టు మంత్రి తెలపడం జరిగింది.15 సంవత్సరాలకు పైబడి ఉన్న వాహనాలకు అదనపు టాక్స్ విధించి పరిమితి కాలం పెంచుతాం అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థలో 15 సంవత్సరాలకు పైబడి ఏ వాహనం లేదని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ పర్మిట్ విధానంపై త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలతో మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నాల ప్రభాకర్ తరపున జరిగింది.
ఇప్పటికే పలువురు పై కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ నీ సరిగ్గా పాటించని ఎనమిది వేల మంది లైసెన్సులు రద్దు చేయమని ఇకపై కూడా ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్నీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ఇకపై ఆ వ్యక్తి పేరు మీద ఎలాంటి వాహనం రిజిస్టర్ అవ్వడానికి అనుమతించబోమని మంత్రి తెలిపారు.హైదరాబాద్ ట్రాఫిక్ లో జర జాగ్రత్త మరి !