Telangana New Ration Card Applications Removed
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం కొత్త రేషన్ కార్డుల అమలు చేయడం కోసం మీ సేవ దగ్గర నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకోవడం రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దాదాపు పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటూ అదరాబాదర చేస్తూ ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించింది మళ్లీ కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటీసు విడుదల చేయడంతో దానిని వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తెలుపడం జరిగింది దీని ద్వారా కిందిస్థాయి అధికారులు మీసేవ సెంటర్ నుండి దరఖాస్తులను స్వీకరించడం ఆపివేశారు..
ఇదంతా వదంతు అని అనుకుంటున్నా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.మళ్లీ ఎప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు అనేది వేచి చూడాలి