AP government Giving To New Cards for Subsidy
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ ఞన్యూస్ చెప్పింది.రైతులకు కావలసిన సబ్సిడీ వివరాలు అన్ని కూడా ఈ కార్డు ద్వారా అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల సబ్సిడీలు అందిస్తుంది.కానీ చాల మంది రైతులకు ఈ సబ్సిడీలు అందాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరి రైతులకు ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు ద్వారా ప్రతి ఒక్క రైతుకు సబ్సిడీ అందే విధంగా ప్రత్యేక కార్డులను అందించనుంది.

కేంద్రం లేదా రాష్ట్రంలో రైతులకు సబ్సిడీ వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ఆన్లైన్లో పూర్తిగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.దీంతో “ఈ పథకం పడలేదు ఆ పథకం పడలేదు” అని రైతులు ఇబ్బంది పడకుండా కేవలం ఈ కార్డు నమోదు చేసుకుంటే చాలు. ఇక అన్ని కార్డులోనే రైతు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన కార్డుకు శ్రీకారం చుడుతుంది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం.ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాజాగా ప్రభుత్వం “అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్” 21 నెంబర్లతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డు రైతులకు కేటాయిస్తుంది. ఈ కార్డు రైతులకు అందినట్లయితే వారికి పథకాల వివరాలతో పాటు రైతులు కనిపిస్తున్న సబ్సిడీలు, వారికి అందిన పథకాలు, అందాల్సిన పథకాలు ఇలా దాదాపుగా అన్ని వివరాలు ఆన్లైన్లో చూపిస్తాయని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు తెలిపారు.

సుమారు 1.70 లక్షల మంది రైతులు ఉన్నారని, వారి వివరాలు సేవా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగులు పోర్టల్ లో నమోదు చేసి తర్వాత ధ్రువీకరణ నిమిత్తం ఎమ్మార్వో లాగిన్ కు వెళ్తాయన్నారు. అక్కడ ధ్రువీకరిస్తే సంబంధిత రైతు మొబైల్ నెంబర్ కు 21 నెంబర్ తో కూడిన ప్రత్యేక ఐడి సమాచారం వస్తుందని తెలిపారు.అయితే ఈ నమోదులో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వేగవంతంగా నమోదు ప్రక్రియ మరల ప్రారంభమైనట్లు అధికారులు తెలియజేశారు. ఇకపై జిల్లాలో రోజుకు 1800 మంది రైతుల వివరాలు ఈ కార్డులో నమోదు జరుగుతుందని తెలిపారు.రైతులు సేవా కేంద్రం వద్దకు ఆధార్ కార్డు, కొత్తగా వచ్చిన ఎల్పీ నెంబర్ తో కూడిన వన్ బి పాస్బుక్ జిరాక్స్, రేషన్ కార్డ్, ఆధార్ లింక్ అయిన ఫోన్ తీసుకువెళ్లాలని తెలిపారు..