What is the Uniform Civil Code 2025
దేశం లో ఇప్పుడు ఎక్కువ ఆదరణ పొందింది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ చట్టం వలన భారతీయ న్యాయ వ్యవస్థ మరింత బలపడనున్నట్లు తెలుస్తుంది.ఎన్నడూ లేనిదీ యిప్పుడు మాత్రమే ఎందుకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావలి అని కేంద్ర ప్రభుత్వం పట్టు బట్టి కూర్చుంది. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత సంవసరపు పార్లమెంటరీ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు.అప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోడ్ ను పట్టించుకోలేదు కానీ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోడ్ ను అమలు చేసిన మొట్ట మొదటి రాష్ట్రంగా నిలిచింది.
ఈ ucc అంటే ఏమిటి
ఏకరూప పౌర నియమావళి అని అర్ధం. అంటే సమాజంలోని అన్ని వర్గాలను (ముస్లిమ్స్,హిందుస్,జైను,సిక్కులు,క్రిస్టియన్స్ ) వారి మతంతో సంబంధం లేకుండా జాతీయ పౌర నియమావళి ప్రకారం సమానంగా చూడాలి..అంటే సొంత మాత చట్టాలను ఆచరించకుండా అన్ని మాటలకూ కలిపి ఒకే చట్టం అన్నమాట ఈ చట్టంలో వివాహం, విడాకులు, నిర్వహణ, వారసత్వం, దత్తత మరియు ఆస్తి వారసత్వం వంటి రంగాలను కవర్ చేస్తాయి.ఈ చట్టం ఆర్టికల్ 44 లోకి వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఇటువంటి చట్టాలు ఉన్నాయి. అమెరికా, ఐర్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, టర్కీ, ఇండోనేషియా, సూడాన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి.భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇచ్చారు కానీ ఇతర నాయకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ UCC వలన కలిగే లాభాలు
- ఏ యూనిఫామ్ సిబిల్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరు తమ జెండర్ తో,మతంతో సంభంధం లేకుండా సమానా హక్కులు పొందుతారు.
- ఇప్పుడు ఏ మతం వారైనా పెళ్లి చేసుకుంటే తమ రాష్ట్రాలు ప్రారంభించిన ucc పోర్టల్ లో తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి.
- పోలీ గాని మరియు బల్యా వివాహాలు ఈ చట్టంలో బాన్ చేయబడ్డాయి.
- తల్లిదండ్రులు సంపాడించిన ఆస్తిలో కొడుకు కూతురుకి సమాన హక్కులు కల్పించాపబడ్డాయి.
- ట్రిపుల్ తల్క్ నిఖా హలాల ఇద్దత్ ను నిషేదించారు.
- లివింగ్ రేలషన్శిప్ ద్వారా బిడ్డకు జన్మనిస్తే వారిని చద్దబద్దంగా చేసింది.
- లివింగ్ రెలాషన్షిప్లో ఉంటె దానిని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇటీవలే ఇలాంటి కేసు ఒకటి ఉత్తరాఖండ్ లో రిజిస్టర్ అయింది. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే ఈ చట్టం ద్వారా 3 ఏళ్ళ జైలు శిక్ష మరియు 25 వేళా జరిమానా విధించబడుతుంది.