Teenmaar Mallanna Warning to CM Revanth Reddy
తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు.
తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.HYD ప్రెస్లోక్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా అని ప్రశ్నించారు.కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.పార్టీ సస్పెన్షన్పై తీన్మార్ మల్లన్న ‘ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పని నిరూపిస్తా.. చర్చకు సిద్ధమా’ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కుల గణన సర్వే పక్కా అని నిరూపించి దీనికి సీఎం బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
లెక్కలు తప్పని నిరూపించేందుకు డిబేట్కు ప్రభుత్వం రెడీ అంటే ఎక్కడికైనా ఒక్కడినే వస్తానని మల్లన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి ఏం చేశావని తనను ప్రశ్నిస్తున్నారని, రేవంత్ రెడ్డి కూర్చున్న CM కుర్చీకి పునాది పడటానికి తాను కారణమని తీన్మార్ మల్లన్న అన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనికి కారణం రేవంత్ అని ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన లెటర్ను ఫ్రేమ్ కట్టించుకున్నట్లు చెప్పారు. దాంతోనే బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుందో చూపిస్తామన్నారు.తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందించారు. కులగణ అంశంలో తన పాత్ర లేదని, గాలిమాటల మల్లన్న మాట్లాడితే కుదరదన్నారు. యేసు క్రీస్తు చెప్పిన గుణాలు కలిగిన నేను.. తప్పు చేసిన వారినే క్షమిస్తా. నా గురించి ఎవరు మాట్లాడినా పట్టించుకోనని, తీన్మార్ మల్లన్న ప్రెస్మీట్ పెడితే ఏంది.. ఇంకేదో పెడితే నాకేంటి అని అన్నారు