Singer Kalpana sucide attempt details released
పరముఖ ప్రఖ్యాత సింగర్ కల్పన తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేశారు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు.
ప్రముఖ సింగర్ అయినా కల్పన తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినా కల్ప ఇప్పుడే కోలుకుంటున్నారు. ఇవాళ ఆమె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ‘కేరళలో ఉన్న తన పెద్ద కూతురిని చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరానని అయితే ఆమె అక్కడే ఉంటానని చెప్పడంతో ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నా’ అని తెలిపారు. కాగా కల్పన ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడంతో ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.ఇప్పిడికే తన రెండవ భర్త అయినా ప్రసాద్ ప్రభకర్ని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోసారి కల్పన ఇంట్లో తనిఖీలు కూడా చేపట్టారు. మరోవైపు తాను పనిమీద రెండు రోజుల క్రితం బయటకు వెళ్లినట్లు పోలీసులకు ప్రసాద్ తెలిపారు.కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుందని తెలిసి పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.
నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పన గురించి ఆమె కుమార్తె దయ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని చెప్పారు. ఇన్సోమేనియా నేపథ్యంలో తీసుకుంటున్న టాబ్లెట్ హైడోస్ వేసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. అటు తమ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని, అందరం సంతోషంగా ఉన్నామని వివరించారు. త్వరలోనే తన తల్లి కల్పన పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తుందని పేర్కొన్నారు.