Teenmaar Mallanna Suspended from Congress TG
తీన్మార్ మల్లన్ననూ కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది.బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
రైతు ప్రస్థానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ విషయంపై టిపిసిసి చీఫ్ మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అగ్రనేత రాహుల్ ఆదేశాలతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇవే పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. కులగణనతో పాటు ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎటువైపు వెళ్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.