Good news for layout registration is 25%
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం కింద పెండింగ్ లో ఉన్న ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.
ఎల్లారీస్ కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యూస్ అయితే చెప్పింది 31 లోగా రాష్ట్ర ప్రజలు ఎల్ఆర్ఎస్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి 25 శాతం వరకు రాయితీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత నెల 19వ తారీఖున జరిగిన మంత్రుల భేటీలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి మార్చి 31 చివరి తేదీన నిర్వహచడం. పేద ప్రజలకు 25 శాతం వరకు రాయితీ ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు తెలియజేశారు.ఒక లేఅవుట్‌లో 10% ప్లాట్లు ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటే, మిగిలిన 90% ప్లాట్లు కూడా LRS కింద రిజిస్టర్ చేయబడతాయని మంత్రులు గుర్తించారు.
ఈ ప్లాట్ యజమానులందరూ రిబేట్‌కు అర్హులు అని సమావేశం నిర్ణయించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అలాంటి ఫ్లాట్లో ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగితే కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ కమిషన్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.