Siddu Jonnala Gadd Jack Movie Review in Telugu
“జాక్ సినిమా ఒక రాయికి ఒక శిల్పానికి మధ్య జరిగిన కథ.. తాబేలుకి, కుందేలుకి మధ్య జరిగిన కథ.. ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి మధ్య జరిగిన కథ.”
డీజే టిల్లు (సిద్దు జొన్నలగడ్డ), వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంతో వచ్చినా జాక్ మూవీ ఇటీవల థియేటర్ లోకి వచ్చింది.రా ఏజెంట్గా మారడం కోసం ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాకముందే ఛార్జ్ తీసుకున్న జాక్ ఎలాంటి సమస్యల్లో పడ్డాడు ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..సెకండ్ ఆఫ్ మూవీకి మైనస్ కాగా కమర్షియల్ కామెడీతో బొర్ కొట్టకుండా కథ సాగింది.బొమ్మరిల్లు భాస్కర్ పరుగు ,బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి తన మార్క్ చూపించుకున్న విష్యం తెలిసిందే..ఇప్పుడు జొన్నలగడ్డతో నిర్మించిన ఈ మూవీ ప్రీ రెలీజ్కు ముందు ఆయన చెప్పింది ఒకసారి గుర్తుకుతెచ్చుకుంటే “జాక్ సినిమా ఒక రాయికి ఒక శిల్పానికి మధ్య జరిగిన కథ.. తాబేలుకి, కుందేలుకి మధ్య జరిగిన కథ.. ఎర్ర బస్సుకి ఎయిర్ బస్సుకి మధ్య జరిగిన కథ.”
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధూ జొన్నలగడ్డ)కి చిన్నప్పటి నుంచీ దేని మీదా ఎక్కువ కాలం ఇంట్రెస్ట్ ఉండదు. క్రికెట్‌తో మొదలు పెట్టి ఆడిన ప్రతి ఆటలోనూ, చేసే ప్రతి పని లోనూ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో మధ్యలోనే దాన్ని వదిలేసి వేరే పని మీద దృష్టి పెడతాడు. దీంతో ఎందులో జాయిన్ అయినా సరే జాక్‌కి ట్రైనింగ్ ఇవ్వలేమని చాలా మంది కోచ్‌లు, ట్రైనర్లు చేతులెత్తేస్తారు.బోరింగ్ జాబ్ చేయడం ఇష్టం లేక RAW ఏజెంట్ కావాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూలో వెళ్లి, సెలక్ట్ కాకముందే ఓ మెషిన్ మొదలెడతాడు. ఓ తీవ్రవాది కోసం ఏజెంట్స్ గాలిస్తున్న విషయం తెలుసుకుని, వారి కంటే ముందే అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి అతని ప్రయత్నాలు ఫలించాయా? ఇంటర్వ్యూలో జాక్ పాస్ అయ్యాడా? లేదా? తెలియాలంటే ‘జాక్’ మూవీ చూడాల్సిందే..
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రాసుకొన్న పాయింట్‌లో బేసిక్‌గా స్కోప్ లేకపోయింది. ఆ పాయింట్ విస్తరించడానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో సింగిల్ పాయింట్‌తో స్క్రీన్ ప్లేతో కథను నడిపించాలనే ప్రయత్నం కనిపించింది. ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌నే చెప్పాడు. కానీ బలమైన సన్నివేశాలు లేకపోయినా.. తనదైన శైలిలో స్క్రీన్ ప్లేతో నెట్టుకు వచ్చాడు. ఇక సెకండాఫ్‌లో ఏం చేయాలన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో చివరకు ఏదో ఒకలా ముగింపు ఇచ్చేందుకు తంటాలు పడ్డారనిపిస్తుంది. ఐడియా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అసలు సమస్యగా కనిపించింది.ఎదురుగా ఉన్నది ఉగ్రవాదులైనా, రా అధికారులైనా ఇంకెవరైనా సరే ఓ ఆట ఆడుకుంటూ ఉంటాడు జాక్.
ఐపీఎస్ గా పనిచేస్తున్న రంగా దగ్గరికి వెళ్లి ‘నువ్వూ, నేను రా ఏజెంట్స్, మనం ఓ మిషన్లో భాగంగా పనిచేస్తున్నామని తన చుట్టూ తిప్పుకొంటాడు హీరో. పోనీ, ఇంతా చేసి కడుపుబ్బా నవ్వించారా అంటే అదీ లేదు. అటు ‘రా’ విభాగంలో కనిపించే సీరియస్నెస్ లేక, ఇటు జాక్ చేసిన అల్లరి టిల్లు తరహాలో ఫన్ పంచలేక… సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జోక్ కాదు ఫన్ అనే ఓ మాట ఈ సినిమాలో ఓ చోట వినిపిస్తుంది. కానీ, ‘రా’ నేపథ్యాన్ని, రా ఏజెంట్స్ని చూపించిన తీరు చూస్తే ఇదంతా ఓ పెద్ద జోక్ అనిపించక మానదు. హీరో పాత్ర, ఫిలాసఫీ విషయంలో మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కనిపిస్తుంది. హీరో నేపథ్యం, తను ప్రారంభించిన ఆపరేషన్ బటర్ ఫ్లై మిషన్, హీరోయిన్తో కలిసి చేసే సందడి తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం పర్వాలేదనిపించినా, ద్వితీయార్ధంలో విషయమేమీ లేదు. నేపాల్కి మారిన కథ ఏ దశలోనూ ఆసక్తిని రేకెత్తించదు. చాలా వరకూ సన్నివేశాలు ఊహకు అందేలా సాగుతుంటాయి. పతాక సన్నివేశాలు తేలిపోయాయి.