Pan Card Link With Aadhar Card Deadline declared: ఈ తేది వరకు లింక్ చేయకపోతే  Pan Card తొలగించబడును 13

Photo of author

By Admin

Pan Card Link With Aadhar Card Deadline declared: ఈ తేది వరకు లింక్ చేయకపోతే  Pan Card తొలగించబడును

ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయాలని భారతీయ ప్రభుత్వం పడే పడే చెబుతుంది ఐన కూడా ఇంకా చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయలేదు.వారికోసం కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది.

కేంద్ర ఆదాయపు పన్ను చెల్లింపుల శాఖ ఎవరైతే తమ ఆధార్ కార్డు ని పాన్ కార్డుతో లింక్ చేసుకోలేదు వారికి ఒక హెచ్చరిక అయితే చేసింది డిసెంబర్ 31 తర్వాత ఎవరైతే ఆధార్ కార్డును లింక్ చేయలేదు వారి యొక్క పాన్ కార్డు డి ఆక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది  ప్రస్తుతం పాన్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలను నిర్వహించాలంటే.. ఇది తప్పనిసరి. ఇంకా పన్ను చెల్లింపుదారులకూ పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి.

ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ప్రజలు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. కాగా, ఈ ఆధార్‌ లింక్‌కు గడువు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో వినియోగదారులను మరోసారి అలర్ట్‌ చేసింది. మీరు ఇంతకు ముందు మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ డీ-యాక్టివేట్ అవుతుంది. ఇది లావాదేవీకి సంబంధించిన ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఆర్థిక మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. అనేక ఫిన్‌టెక్ కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్స్‌ను రూపొందించడానికి అనధికారిక పద్ధతిలో పాన్ వివరాలను ఉపయోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అందుకే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ ను పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది.

ప్రతి ఒక్క పౌరుడు తాము ఇంటి వద్దనే కూర్చొని పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో ఎలా లింక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం …
స్టెప్ 1
మీరు మొదటగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైటు కి వెళ్ళాలి.
స్టెప్ 2
మీరు కొంచెం కిందకి వెళితేయ్ అక్కడ లింక్ విత్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3
ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మూడు స్టెప్స్ చూపిస్తుంది లింక్ ఆధార్ అండ్ వెరిఫికేషన్ అండ్ స్టేటస్ మీరు మొదటగా మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు మీ పాన్ కార్డు నెంబర్ ఆడ్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి.చేసిన వెంటనే మీ పాన్ కార్డు వివరాలు రావడం జరుగుతుంది మీరు మీ వివరాలను కన్ఫర్మ్ చేస్తేయ్ సరిపోతుంది.మీకు ఆటోమేటిక్ గా లింక్ అవ్వడం జరుగుతుంది.

 

Leave a Comment