PDSU union demanded Release Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ 2024

Photo of author

By Admin

PDSU union demanded Release Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ 

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

PDSU union demanded Release Fee Reimbursement రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు గడుస్తున్నా నేటికీ విద్యారంగ సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం, విద్యాశాఖ కు ప్రత్యేక మంత్రిని కేటాయించడం లేదని తద్వారా గత కొద్ది సంవత్సరాల నుంచి విద్యా రంగంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి ఉందని పేర్కొన్నాడు.

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన *పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్ మాట్లాడుతూ* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు గడుస్తున్నా నేటికీ విద్యారంగ సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం, విద్యాశాఖ కు ప్రత్యేక మంత్రిని కేటాయించడం లేదని తద్వారా గత కొద్ది సంవత్సరాల నుంచి విద్యా రంగంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి ఉందని పేర్కొన్నాడు.

ఐదు సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు న్యాయబద్ధంగా రావలసిన ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందన్నారు. దీనితో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. రియంబర్స్మెంట్ రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను బలవంతంగా ఫీజులు కట్టెల ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల కాకపోవడంతో స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నడుస్తున్న చిన్న తరహా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూతకు గురవుతున్నాయన్నారు.

కొన్ని బడా డిగ్రీ కళాశాలలు నాన్ దోస్తు కాలేజీలుగా అవతరించి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా విధానం అంతా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి పోయిందని దీంతో డిగ్రీ విద్య కూడా కార్పొరేట్ల వశమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు. ఒకపక్క ఏడాది పాలనకు ముందే ఉత్సవాలకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం మొండి చేయి చూపిస్తుందన్నారు. వెంటనే రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యారన్నాడు.

హాస్టల్ విద్యార్థులకు మెస్ ,కాస్మోటిక్ చార్జీలను పెంచామని అంటున్న అవి కూడా సరిపోవని వాటిని డబుల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ విద్యాసంస్థలు కళాశాలలు, యూనివర్సిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని కట్టడి చేయాలన్నారు. నగరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులను, మెట్రోపాస్ లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యార్థులు చదువులతో పాటు సామాజిక స్పృహను కలిగి ఉండి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పి.డి.ఎస్.యు నాయకులు కె. శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, మహేష్,పవన్, జీవన్ గణేష్, నవీన్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment