KTR Reacted On Koushik Reddy Arrest 2025: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య
టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జూబ్లీహిల్స్ లోని ఓ టీవీ ఛానెల్ డిబేట్లో పాల్గొని బయటికి రాగానే అదుపులోకి తీసుకొని KNR వనౌన్ పీఎస్కు తరలిస్తున్నారు. నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కౌశిక్పై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డికి తోపులాట జరగడంతో సంజయ్ రెడ్డి స్పీకర్కు వినతి పత్ అందజేశారు దీంతో ఆయనను కస్టడీ లోకి తీసుకున్నట్లు తెలిపారు.
పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్ను బేషరతుగా విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.