PM Opened Telangana Turmeric Board Nizamabad: బాండ్లు రాసి మరి పసుపు బోర్డును తెచ్చిన ధర్మపురి అరవింద్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈరోజు పసుపు బోర్డు భూమి పూజ పూజ చేయనున్నారు..
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పసుపు బోర్డు ఏర్పాట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక పాత్ర వహించారు ఎలక్షన్ హామీల్లో రైతులకు భరోసా ఇచ్చిన ఆయన బాండ్లు రాసి మరి నన్ను గెలిపిస్తే పసుపు బోర్డ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమకు పసుపు బోర్డు కావాలని 2023 ఎన్నికల్లో ఏకంగా మోడీ నిలబడ్డ స్థానం నుంచి ఎగైనెస్ట్ గా రైతులు పోటీ చేయడానికి కొనుక్కున్నారు దీన్ని అర్థం చేసుకున్న ధర్మపురి అరవింద్ తమను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని తెలిపారు వందరోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిన ఆయన సంవత్సరంలో పసుపు బోర్డును తీసుకురావడం జరిగింది మధ్యలో విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా ముక్తకంఠంతో ప్రయత్నం చేసి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు.
మొదట మహారాష్ట్రలో ఉన్నటువంటి పసుపు బోర్డును నిజామాబాదుకు మార్చాలని చూస్తే మహారాష్ట్ర సీఎం మరియు ఎంపీలు ఎదురు తిరగడంతో అక్కడ పులిస్టాప్ పడింది 2023లో ప్రధాని మోదీ నేరుగా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో పార్టీపై ఆంక్షలు పెరిగాయి సంక్రాంతి పర్వదినాన్ని ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డును ప్రారంభించారు. 2023 నుంచి సాగుతున్న ఈ ప్రక్రియ నేడు రైతులకు తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఎన్నో ఏళ్ల కలగా ఎదురుచూస్తున్న పసుపు రైతులకు ఇది ఒక మంచి శుభవార్త.
- మే 2024లో ఈరోడ్ మార్కెట్‌లో పసుపు క్వింటాల్‌కు ₹10,000 నుండి ₹18,000 మధ్య ధరలు ఉన్నాయి.
- ఆగస్టు 2024లో NCDEXలో పసుపు కోసం అక్టోబర్ ఫ్యూచర్స్ ప్రస్తుతం క్వింటాల్‌కు ₹16,446 వద్ద ట్రేడవుతుండగా, నిజామాబాద్‌లో స్పాట్ ధరలు ₹16,161గా ఉన్నాయి.
- ఫిబ్రవరి 2024లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు కాడి (కొమ్ము) క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.12559 పలికింది.
పసుపు బోర్డు ఏర్పాటు కావాలని నిరసనలు చేపట్టితేనే 16 వేలకు వెళ్లిన పసుపు ధర నేడు పసుపు బోర్డు ఏర్పాటుతో మరింత పెరిగే అవకాశం ఉంది దీని ద్వారా పారిశ్రామిక పెరుగుతుంది మరియు ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. ఈ నూతనంగా ప్రారంభించిన పసుపు బోర్డు చైర్మన్గా బిజెపి సీనియర్ నేత పల్ల గంగిరెడ్డి ని నియమించారు.