Konda Surekha Comments on KTR : చైతు సామ్ విడాకులకు కారణం KTR 2024

Photo of author

By Admin

Konda Surekha Comments on KTR : చైతు సామ్ విడాకులకు కారణం ktr

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి ktr పై కీలక వాక్యాలు చేసింది.ఇప్పుడు ఇండ్రస్టీ తో పాటుగా రాజాకీయ వర్గాల్లో హాట్ టాపిక్

తెలంగాణ లో రాజకీయాలు రోజు రోజుకు అసహ్యంగా మారుతున్నాయి.ఎవరు ఎవర్ని ఎందుకు దూషిస్తున్నారో తెలియకుండా రైతుల సమస్యలపై మరియు రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇతర సమస్యలను కొని తెస్తూ ప్రజల సమస్యలను పక్కన పెడుతున్నారు.దీనికి నిదర్శనం ఈ రోజు తెలంగాణ దేవాదాయ మరియు అటవీ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు చేసిన వాక్యాలే.ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులకు రైతు భరోసా ఇంతవరకు ఇవ్వకుండా రోజు రేపు అంటూ జరుపుతూ వెళ్తున్న ఈ ప్రభుత్వానికి వాటి గురించి పట్టించుకునే అంత సమయం లేదు కానీ సినీ ఇండ్రస్టీ వాళ్లపై ఫోకస్ పెట్టి వాళ్లకు లేని సమస్యలను కొనుకొని మరి ఇచ్చే అంత సమయం వీళ్ళకి ఉంది.

Konda Surekha Comments on KTR

KONDA VS KTR
KONDA VS KTR

శ్రీమతి కొండా సురేఖ గారు ఈ రోజు మీడియా లో నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కల్వకుంట్ల తారక రామారావు అని అన్నారు దీంతో అటు రాజకీయ పార్టీ వర్గాల్లో మరియు ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపింది . ఈ విష్యం పై స్పందించిన రాజకీయ పార్టీలు తమ నేత పై అసత్య ప్రచారం చేస్తున్నారు.అంటే కాకుండా మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగతమగా దూషించే చర్యలకు పాల్పడుతున్నారు అని భారతీయ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు మంది పడ్డారు. వెంటనే కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదంటే కోర్ట్ కు వెళ్తామని అన్నారు.

Konda Surekha Comments on KTR
Konda Surekha Comments on KTR

అటు సినీ వర్గాల్లో అక్కినేని ఫామిలీ పెద్ద నాగచైతన్య తండ్రి నాగార్జున రియాక్ట్ అయ్యారు.రాజకీయాల్లోకి మీ పని మీరు చూసుకోకుండా మా కుటుంబాన్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు.మీరు అన్న ఒక్క మాటతో మా కుటుంబాన్ని బయటికి లాగారు.ఏమి తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతారు అస్సలు మా కుటుంభం విషయాలు మీకు ఎందుకు.మీరు వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొవాలి అని అన్నారు.

ప్రకాష్ రాజ్

స్పందిస్తూ ఏంటి ఈ నీచ రాజకీయాలు ! రాజకీయాల్లోకి సినీ వాళ్ళని ఎందుకు లాగుతున్నారు జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు.ఈ విష్యం పై హెరాయిన్ సమంత కూడా రియాక్ట్ అయ్యారు.

నాగచైతన్య

గౌరవనీయులైన శ్రీమతి కొండా సురేఖ గారు మీరు చేసిన ఈ వ్యాఖ్యలు అంత అబద్ధం మీరు మీ రాజకీయ ప్రయాజనాల కోసం సినీ ప్రముఖులను వాడుకోవద్దు.మమ్మల్ని మా పనులు చేసుకోనివ్వండి దయ చేసి మీ రాజకీయ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలి అని అంటూ రే ట్వీట్ చేసాడు

సమంత

మా విడాకులు సామూహికంగా పరస్పర అంగీకారంతో తీసుకోవడం జరిగింది.మీరు ఒక మహిళగా అలోచించి మాట్లాడితేయ్ బాగుంటుంది.ఒక మహిళా బయటికి వచ్చి బతకడం ఎంత కష్టమో మీకు తెలుసా ఆ కష్టాన్ని నేను ఎదుర్కొని నిలబడ్డాను.దయ చేసి మీ రాజకీయాల కోసం నన్ను వాడుకోవద్దు.ఐన “విడాకులు అనేవి మా వ్యక్తిగత సమాచారం మీకెందుకు” మీరు అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారు అని అనుకుంటున్నా అని ట్వీట్ చేశారు.

అస్సలు సురేఖ ఎం అంది

ఒక బీసీ మహిళను ఐన నాపై సోషల్ మీడియాలో దూషిస్తూ పోస్టులు పెద్దదం సరికాదని ఈ పోస్టులను మాజీ మంత్రి కుట్ర పెట్టమన్నాడని తన వాళ్ళ సినీ ఇండ్రస్టీ వాళ్ళు కూడా ఎంతో మంది ఇబ్బంది పడ్డారని అన్నారు అంటే కాకుండా ఎంతో మంది త్వరగా పెళ్లిళ్లు చేసుకొని ఇండ్రస్టీ నుండి వెళ్లిపోయారని అక్కినేని కుటుంభం విడిపోవడానికి కారణం కూడా KTR అని అంది.

Leave a Comment