Indiramma Indlu Committee 2024: ఇందిరమ్మ ఇండ్లకు కొత్త కమిటీ అమలు
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త కమిటీ ని నిర్మించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన ఆరు గారెంటీలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే కొన్ని గారెంటీలను అమలు చేస్తుంది.అందులో ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంచడం గృహ జ్యోతి కింద మహిళలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ని ఇచ్చింది అలాగే ఇప్పుడు ఇందిర్మమ్మ ఇండ్ల ను ఇవ్వనున్నట్టు తెలిపింది.
మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలను మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి సమ్బన్ధంచి అన్ని సదుపాయాలతో ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన నెలలోపే అమలు చేసింది.ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తేవడానికి ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరుతో ఫామిలీ డిజిటల్ కార్డ్స్ ను అందుబాటులోకి తీసుకురానిది.దీనిపై అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి చూస్తోమది ప్రభుత్వం.
పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్ గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.
నేటికీ ఫైనల్ అవుతున్నాయి అని కలెక్టర్లు తెలిపారు.ఈ పథకం కింద వేసిన కమిటి లో ఉన్న సభ్యుల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి విడి విధానాలను ఖరారు చేయనున్నారు.గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేద,నిరుపేద వర్గాల ప్రజలకు సొంత ఇంటి కళను నిజం చేయడం కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించింది.కానీ యేండ్లు దాటుతున్న వాటిని ప్రజలకు ఇవ్వలేదు దీంతో పలు చోట్ల డాబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరాయి.కొన్ని చోట్ల ఇండ్లను ఇచ్చిన కూడా ప్రతి ఇంటిలో ఒక సమస్య ఏర్పడుతుందంటూ ,3 సంవత్సరాలు ఐన పూర్తి కాకా ముందే కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడుతున్నాయి అని ప్రజలు పేర్కొన్నారు.ఐతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇండ్లను రెన్నొవేషన్ చేయించుకొని ఇష్టం అని అన్నారు.
కమిటీ ద్వారా అర్హుల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను సంబంధించి అర్హుల గుర్తింపు కోసం కొత్త కమిటీ ని నియమించబోతుంది.దీని ద్వారా అర్హులను గుర్తించి వారికి సొంత జాగా ఉంటె వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ,సొంత జాగా లేని వారికి ఇండ్లు కట్టించి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది.తెలంగాణ మాలి దశ ఉద్యమకారులకు 250 గజాల జాగాను కేటాయినిచ్చి వారికి ఇల్లుని కట్టి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్ గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.