Indiramma Housing Scheme :ఇందిరమ్మ గృహ యోజన పథకం ద్వారా వీరికే ఎక్కువ లబ్ది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీని అయితే దసరా లోపు అమలు చేయబోతుంది.
తెలంగాణ ఇందిరమ్మ గృహ యోజన పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలో ఒక గ్యారెంటీ అయినా తెలంగాణ ఇందిరమ్మ గృహ యోజన పథకాన్ని దసరా లోపల అమలు చేయాలని ఆలోచన చేస్తూ ఉండి ఈ పథకంలో భాగంగా ఎవరికి ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అంటే నిరాశ్రయులుగా ఉన్నవారు తమ పేరుపై గుంట జాగ కూడా లేని వారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం.
అలాగే ఎవరైతే సొంత భూమి ఉండి ఇంటిని నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఇచ్చి వారిని ఆదుకోనుంది వెళ్ళు నిర్మాణ ఖర్చులు కోసం ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వనుంది ఇందులో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ రిటైర్డ్ ఉద్యోగులు స్థలహీనులు అయితే ఉండన్నారు.ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సైనికులు, కార్యకర్తలకు ఈ పథకం ప్రత్యేకమైన స్థలాలను కేటాయించనుంది.
Indiramma Housing Scheme
పథక లక్ష్యాలు
ఈ పథకం ప్రధానంగా నిరాశ్రయులను గృహ నిర్మాణం ద్వారా స్వయం సమృద్ధిని పొందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం అందించే 250 చదరపు గజాల స్థలం మరియు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం, లబ్ధిదారులకు సొంత గృహాన్ని నిర్మించుకోవడంలో సాయపడుతుంది. ముఖ్యంగా, ఈ పథకం ద్వారా తక్కువ ఆదాయం కలిగిన వర్గాలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వబడుతుంది.
పథకం ద్వారా పొందే ప్రయోజనాలు
Telangana ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహ యోజన పథకం కింద ప్రతి అర్హత గల అభ్యర్థి ఉచితంగా ఇంటి స్థలం పొందడం లేదా ఆల్రెడీ ఇంటి స్థలం ఉండి కట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి 5 లక్షల రూపాయలను నిర్మాణ వ్యయంగా ఇవ్వనున్నారు.తెలంగాణ ఉద్యమ సైనికులకు 250 చదరపు మీటర్ల స్థలం ప్రత్యేకంగా కేటాయించబడుతుంది. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 గృహాల కేటాయింపు కూడా ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగాలు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాయి.
అర్హతలు
- అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తెలంగాణ నివాసి అయ్యి ఉండాలి.
- అభ్యర్థి కుటుంభం ఇంత వరకు ఇందిరమ్మ గృహ యోజన కింద ఎలాంటి ప్రయోజనం పొంది ఉండవద్దు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 2 లక్షల కన్న తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉండాలి.
- ఉద్యమ సైనికుల అర్హత కోసం, వారు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులు అయి ఉండాలి.
దరఖాస్తు విధానం
మునిసిపల్ కార్పొరేషన్, గ్రామ సభ లేదా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు ఫారం పొందాలి.ఫారాన్ని పూరించి అవసరమైన పత్రాలు జతచేసి సమర్పించాలి.లేదా, ప్రజా పాలన వెబ్‌సైట్ నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- వసతి ధృవీకరణ
- కుల ధృవీకరణ
- ఆదాయ ధృవీకరణ
- రేషన్ కార్డు
2024 నుంచి ఈ పథకం దశల వారీగా అమలు చేయబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.ఇంద్రమ్మ గృహ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కేటాయించబడతాయి. నిర్మాణం సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఇంజినీరింగ్ విభాగాలు పని చేస్తాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో, నిర్మాణానికి అవసరమైన నిధులు దశల వారీగా విడుదల చేయబడతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యత
ఈ పథకం ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరాశ్రయులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు తమ స్వంత గృహాన్ని నిర్మించుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అందించే స్థలం ఈ కుటుంబాలకు భద్రతను, ఆత్మనిర్బంధతను కలిగిస్తుంది.