Bird Flu Attacked chicken in Andhra Pradesh
తూ.గో(D)లో బ్రాయిలర్ కోళ్ల మృతిపై కలెక్టర్ ప్రశాంతి స్పందించారు. పెరవలి(M) కానూరులోని ఓ పౌల్ట్రీఫామ్ శాంపిల్సు పరీక్షించగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిందని తెలిపారు. కానూరు చుట్టూ 10KM పరిధిలోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు క్లోజ్ చేయాలని, కోళ్లు, గుడ్లను పూడ్చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలపై సర్వే చేయాలన్నారు. కొన్నిరోజులు ప్రజలు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు.
గోదావరి జిల్లాల్లోని కానూరు, వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు. దీంతో మిగతా ప్రాంతాలవారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని, సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఫారాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతిచెందిన నేపథ్యంలో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లిలో కోళ్ల మరణాలకూ బర్డ్ ఫ్లూ కారణమని భావిస్తున్నారు.