Telangana New Ration Cards Applications
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటుంది అని కొందరు జోరుగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటున్నారు అని అంటే మరికొంతమంది కేవలం కరెక్షన్స్ కోసం మాత్రమే అప్లికేషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు అలాగే మరికొంతమంది అది ఫేక్ న్యూస్ అని చెప్తూ ఉన్నారు అసలు దీంట్లో నిజం ఎంత ? కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారా లేదా ?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కోసం దాదాపు పది లక్షల మంది వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజా పాలన ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకుంది అలా తీసుకున్న తర్వాత కూడా మరికొంతమంది మీసేవ ద్వారా కొత్త రేషన్కార్లకు అప్లికేషన్స్ అయితే పెట్టారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు అందాలి అంటే ఈ రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేషన్ కార్డు తీసుకోవడం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. గతంలో కొత్త రేషన్ కార్డులను లేదా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం తీసుకు వచ్చేది.
కానీ కేంద్ర ప్రభుత్వం బోగస్ రేషన్కాలను వేరువేయడం కోసం ఈ కేవైసీ చేయాలని నిర్మిత గడువును ఇవ్వడంతో చాలామంది ఈ కేవైసీని పూర్తి చేశారు మరి కొంతమంది ఈ కేవైసీ పూర్తి చేయలేక పోయారు అలాగే కొత్తగా పెళ్లయిన వారు తమకు కొత్త రేషన్ కార్డు తీసుకోవడం కోసం పేరెంట్స్ తో ఉన్నా రేషన్ కార్డులో తమ పేరు తొలగిస్తే తప్ప కొత్త రేషన్ కార్డులకు అర్హత లేదు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువుని ముగించిన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే పాత రేషన్ కార్డులో తమ పేర్లు తొలగించుకోవాలని తొలగించుకున్న తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారని తెలిపింది.
అలాగే ప్రజా పాలన ద్వారా గాని మీసేవ ద్వారా కానీ ఇంతకుముందే అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే మీసేవ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇదివరకే పాత కార్డులో కనుక పేర్లు ఉన్నట్లయితే వారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హత లేదంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా పాత విషయం కార్డులో పేరును తొలగించుకున్న తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.