Bandi Sanjay Arrest Group 1: రాష్ట్రంలో నిజం పాలనా నడుస్తుంది అన్న కేంద్ర మంత్రి
రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగగా ఇప్పుడు వారికి అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్క్రీంలోకి వచ్చారు.
గ్రూప్-1 అభ్యర్థులతో న్యాయం చేయాలని కోరుతూ అశోక్ నగర్ నుంచి సచివాలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘చలో సచివాలయం’ ర్యాలీ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది.గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నిరుద్యోగులు భారీగా ఆయన వెంట తరలి రావడంతో ఇందిరా పార్క్ సమీపంలో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.ఆయనను పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నామని బండి సంజయ్ పోలీసులకు చెప్పారు.మరోవైపు పోలీసులు గో బ్యాక్ అంటూ నిరుద్యోగులు నినాదాలు చేస్తున్నారు. తాను ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానని, సీఎంకు వాస్తవాలు వివరిస్తానని బండి చెప్పారు. జీవో 29ను ఉపసంహరించుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.రేవంత్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. అభ్యర్థుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని సూచించారు.
గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా హైదరాబాద్లో ఆందోళనకు దిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు సీఎస్ శాంతికుమారి ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. జీవో 29ను రద్దు చేయాలంటూ అభ్యర్థులతో కలిసి సంజయ్ సెక్రటేరియట్కు ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు.HYD అశోక్ నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక్కసారిగా రోడ్లపైకి బీజేపీ కార్యకర్తలు, గ్రూప్-1 అభ్యర్థులు వచ్చారు. తమకు న్యాయం చేయాలని, జీవో నంబర్ 29 రద్దు చేసి పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు గ్రూప్-1 అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అశోక్ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. ఈక్రమంలోనే బండి ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. దీంతో ఆయనకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.
మరో వైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద లాఠీఛార్జ్ జరిగి అక్కడ కూడా ఉదృక్త వాతావరణం చోటు చేసుకుంది భారీ సంఖ్యలో హిందువులు అక్కడకు చేరుకొని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు.