AP Free Gas Cylinders : వీరికి ఉచితముగా 3 గ్యాస్ సీలిండర్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలకు ఉచితంగా గ్యాస్ సైల్న్డెర్స్ ఇవ్వడానికి అర్హతలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ రోజుల్లో ఉచితంగా ఏదైనా వస్తుంది అంటే ప్రజలు వదులుకోరు అలాంటిది వంట కోసం ఉపయోగించుకునే గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే ఎందుకు వదులుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పొందటానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ను ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా రెడీగా ఉంది ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ గ్యాస్ సిలిండర్లను సీఎం చంద్రబాబు నాయుడు మహాశక్తి పథకం ద్వారా అయితే ఏమన్నారు మరో 20 రోజుల్లో ఈ మహాశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అయితే మొదలుపెట్టి మార్చి 31 2025 లోపు ఈ పథకాన్ని పూర్తిగా ముగించాలని చూస్తూ ఉన్నారు. దీనికోసం ఇప్పటికే అర్హుల గుర్తింపు మొదలయితే జరిగింది సీఎం అందిస్తున్న ఈ ఉచితంగా మూడు సిలిండర్లా పథకంపై ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు ఎలాగైతే తెలంగాణ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ కి ముందుగా డబ్బులు పే చేయమని చెప్తుందో అదే విధంగా ఇప్పుడు ఉచితంగా ఇచ్చేటటువంటి మూడు గ్లాసులు ముందే డబ్బులు చెల్లించవలసి ఉంటుంది.ఆ డబ్బును తిరిగి లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌లో గ్యాస్ ఏజెన్సీలు జమ చేస్తాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఆదేశం రాలేదు.

3 ఉచిత సిలిండర్లు పొందేందుకు అర్హతలు:
3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కొన్ని అర్హతలు, గైడ్‌లైన్స్ జారీ చేయనుంది.
- జనరల్‍గా ఉండే రూల్స్ చూస్తే, డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. అంటే.. ఈ కనెక్షన్ వాణిజ్య అవసరాలకు సంబంధించినది అయి ఉండకూడదు.
- ఇళ్లలో వాడుకునేది అయివుండాలి.
- గ్యాస్ సిలిండర్ పొందాలంటే లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయివుండాలి, ఏపీలోనే నివసిస్తూ ఉండాలి.
- ఇక్కడ ఇల్లు ఉండి, వేరే రాష్ట్రాల్లో ఉంటే కుదరదు.
- లబ్దిదారులు వైట్ రేషన్ కార్డు కలిగివుండాలి.
- ఆ రేషన్ కార్డుపై ఒకటే గ్యాస్ కనెక్షన్ ఉండాలి.

ఈ మహాశక్తి పథకం కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్దిదారులు తాము అర్హులం అని నిరూపించుకునేందుకు..
- ఆధార్ కార్డు,
- మొబైల్ నెంబర్,
- కరెంటు బిల్లు,
- అడ్రస్ ప్రూఫ్,
- రేషన్ కార్డ్ కాపీలు దగ్గర పెట్టుకోవాలి. మీసేవ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ఇంకా ప్రభుత్వ ఆదేశాలు రాలేదు. అవి రాగానే అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక.. వెంటనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వీలైనప్పుడు చేసుకోవచ్చు. అర్హులు, ఎప్పుడైనా అర్హులే అవుతారు. అందువల్ల హడావుడిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే, అన్నీ రెడీగా ఉంచుకుంటే, వెంటనే అప్లై చేసుకొని, దీపావళి పండుగ సమయంలోనే మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే వీలు ఉంటుంది.