రైతులకు ఈ యూనిక్ ఐడి నెంబర్ ఉంటేనే ప్రభుత్వ పతకాలు | AP CM giving a Unique number to Farmer schemes | 2025

AP CM giving a Unique number to Farmer schemes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలనే ఉద్దేశంతో వారికి ఒక యూనిట్ నెంబర్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ నెంబర్ ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం అందించే పథకాలను తీసుకోవచ్చని తెలిపింది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

ప్రభుత్వం రాష్ట్రం మరియు కేంద్రం సంయుక్తంగా ఏర్పడిన ఎండిఏ ప్రభుత్వం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కేంద్రం మరియు రాష్ట్రం అందించేటటువంటి అన్ని పథకాలు అందాలనే ఉద్దేశంతో వారికి ఫార్మర్ యూనిక్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా రైతులు తాము ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే ఆ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు అందుతాయి అని వ్యవసాయ శాఖ అధికారులు భరోసా వ్యక్తం చేశారు .దీనిని ఇప్పటికే కృష్ణ గుంటూరు జిల్లాలో ప్రారంభించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలు

  1. అన్నదాత సుఖీభవ: ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సహాయంగా 15 వేల రూపాయలు ఇస్తుంది.
  2. పంట బీమా: వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల నష్టానికి పరిహారం.
  3. వ్యవసాయ పరికరాలపై రాయితీలు: ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్లులు వంటి సాధనాలకు 40-50% సబ్సిడీ.
  4. PM కిసాన్ యోజన: సాలీనా ₹6,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
  5. సాగునీటి సదుపాయాలు: నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యత ఆధారంగా మద్దతు.

నమోదు ప్రక్రియ ఏంటి ?

కావలసిన డాక్యుమెంట్స్:

  • అధార్ కార్డు (Aadhaar Card)
  • అధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్
  • పట్టా/భూమి దస్తావేజులు (Land Records)

Step 1:-

రైతు సేవా కేంద్రానికి విజిట్:
  • స్థానిక రైతు సేవా కేంద్రం (Rythu Seva Kendra)లో సిబ్బందిని సంప్రదించండి.
  • డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ నమోదు ప్రారంభించండి.

Step 2:-

OTP ధృవీకరణ:

నమోదు సమయంలో అధార్-లింక్డ్ మొబైల్కు OTP వస్తుంది. దాన్ని సిబ్బందికి అందజేయండి.

Step 3:-

యూనిక్ ఐడీ జనరేషన్:

ప్రక్రియ పూర్తయిన తర్వాత, 14-అంకెల ప్రత్యేక సంఖ్యను SMS/రసీదు ద్వారా పొందండి.

ఉపయోగాలు ఏంటి?

ప్రభుత్వం ఇస్తున్న ఈ యూనిక్ ఐడిని పొందడం ద్వారా రాష్ట్రం మరియు కేంద్రం సంయుక్తంగా కలిసి అమలు చేస్తున్న పథకాలు రైతులకు నీరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ అవడం జరుగుతుంది అలాగే రైతులు ఈ పథకాలకు అర్హులు అయితే వారికి పథకాలు ఇంటికే అందడం జరుగుతుంది.

ముగింపు

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ యునిక్ ఆథెన్టికేషన్ ద్వారా ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్క పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment