BRS meeting chaired by KCR at Telangana Bhavan
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ, రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
రైతు ప్రస్థానం : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ, రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తెలంగాణ భవన్లోకి అడుగుపెట్టగానే పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయనను చూసిన అభిమానులు, కార్యకర్తలు సీఎం.. సీఎం.. అంటూ హోరెత్తించారు. కాగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.