PM Kisan Samma Nidhi Release Date Announced
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సన్మాన్నిధి 19వ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఈ ఒక్క విడత అందితే రైతులకు 19 విడుదల పూర్తిగా రైతుల ఖాతాలో డివిటి ప్రక్రియ ద్వారా అయితే అందించనుంది.

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 6000 రూపాయలని సంవత్సరానికి 3 వుడుతలుగా రైతుల ఖాతాలో DBT ప్రక్రియ ద్వారా పీఎం కిసాన్ నిధులను జమ చేస్తున్న విషయం తెలసిందే. ఇప్పుడు 19వ విడత నిధులైన 2000 రూపాయలను ఫిబ్రవరి 24వ తారీఖున విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. ఈ విడత డబ్బులను రైతులకు నేరుగా తమ యొక్క పిఎం కిసాన్ ఖాతాలో డిబిరి ప్రక్రియ ద్వారా జమ చేయనుంది.ఈ జమ ప్రక్రియను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బాగాల్పూరు వేదికగా విడుదల చేయనున్నారు.రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 18 విడుతల నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది.

సీఎం కిసాన్ కు సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు కచ్చితంగా ఈ కెవైసీ అయితే పూర్తి చేసుకొని ఉండాలి ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే మాత్రమే డబ్బులు తమ ఖాతాలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ విషయాన్ని అధికారిక వెబ్సైటు అయినా పిఎం కిసాన్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. మీరు గనక ఇంతవరకు పిఎం కిసాన్ కు సంబంధించి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి ఇచ్చిన లిస్టులో మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి.పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది.

ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ క్లిక్ చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయండి.