AP Budget Highlights in 2025 – 2026
కూటమి ప్రభుత్వం నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ఉదయం 10గం.కు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు . సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు, తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ను సభ్యులతో పాటు మీడియాకు ఇవ్వనుంది.
రూ.3.24లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు
బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్య శాఖకు రూ.19264 కోట్లు కేటాయించామన్నారు.
రూ.48,340కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి మా టార్గెట్. కొత్త కౌలు చట్టం తీసుకొస్తాం. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తాం’ అని మంత్రి అన్నారు.పోలవరం ప్రాజెక్టు 73% పూర్తయిందని, 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏటా దాదాపు 2వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం CM చంద్రబాబు పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్-2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.