Ponnam Shock Telangana Caste Resurvey Closed
మొత్తం 3.50 లక్షల కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10వేల ఫ్యామిలీలే ఎంట్రీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
రైతు ప్రస్థానం: ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేటితో ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వం ఈనెల 16 నుంచి రీసర్వే చేపట్టింది. అయితే ఇందులోనూ వివరాలు ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. మొత్తం 3.50 లక్షల కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10వేల ఫ్యామిలీలే ఎంట్రీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కులగణన సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రీసర్వే గడువు నేటితో ముగుస్తుందని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ఎంపీడీవో, వార్డు ఆఫీసులతో పాటు seeepcsurvey.cgg.gov.in సమాచారాన్ని ఇవ్వొచ్చని వివరించారు.