Hyderabad Full Filled with High Traffic : హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్
సంక్రాంతి సెలవలు ముగిసి పల్లె నుంచి పట్నానికి మల్లి వలసలు మొదలవడంతో హైదరాబాద్ కూడళ్లు మొత్తం ఇవాళ ఉదయం నుంచి భారీ రద్దీగా మారాయి మల్లి కొత్త హైద్రాబాదుగా కొత్త ఎంఈజీతో హైదరాబాద్ మొదలవబోతోంది.
రైతు ప్రస్థానం : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. దీంతో ప్రధాన మార్గాలు, చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్లకు వెళ్లే వారు ఆలస్యంగా వెళుతున్నామని చెబుతున్నారు. కూకట్పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, అమీర్పేట్, తిరుమలగిరి, గచ్చిబౌలి తదిరత ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. నేటి నుంచి ఆఫీస్లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.