Actor Posani Krishna Murali Hot Comments
సినీనటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణ ముగిసింది. ఓబులవారిపల్లె పీఎస్లో ఆయనను 9 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను విచారించారు. విచారణ అనంతరం పోసానిని రైల్వేకోడూరు కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు.
పోసాని కృష్ణ మురళి డిప్యూటీ సిఎం పవన్ కళ్యనపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయనను మొన్న రాత్రి పోలీసులు తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. ‘పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలామందిపై ప్రభావం చూపుతాయి. సమాజంలో విభజన, ఉద్రిక్తతలు తెచ్చేలా ఆయన మాట్లాడారు’ అని పోలీసులు పేర్కొన్నారు.అంతరం 9 గంటల పాటు విచారణ జరిపిన వీడియో అండ్ ఆడియో విజువల్స్ నీ రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
రా.9 గంటల నుంచి ఉ.5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.ఆయన్ను కస్టడీ కోరుతూ ఇవాళ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొన్న హైదరాబాద్లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఓబులవారిపల్లె తీసుకొచ్చి నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. అనంతరం రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మార్చి 12 వరకు రిమాండ్ విధించారు.