What is the1 70 Act Ap Govt Released The Law
గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆందోళన, అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.
భూమి బదలాయింపు చట్టం-1959ను 1970లో 1/70 చట్టంగా మార్చారు. దీని ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం. గిరిజనులు, గిరిజనులు సభ్యులుగా ఉండే కో-ఆపరేటివ్ సొసైటీకి తప్ప వేరే వారికి స్థిరాస్తిని అమ్మడం, కొనడం, బహుమతిగా ఇవ్వడం వంటి బదలాయింపులు చేయరాదు. 1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లఘించిన వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపవచ్చు.
పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ, రేపు అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు మిగతా గిరిజన ప్రాంతాల్లో బంద్ నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ బంద్కు వైసీపీ మద్దతు ప్రకటించింది. తెల్లవారుజామునుంచే షాపులను మూసివేయడంతో పాటు వాహనాలను అడ్డుకుంటున్నారు.