RG Kar Rape Murder Case Victim Court Punished : ఆరుగురు ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయు మాత్రమే నిందితుడా 2025
దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది.
దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది.2024 AUG 95 RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.
దోషికి గరిష్ఠ శిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అటు కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. న్యాయమూర్తి అనిర్బన్ దాస్కూ భద్రత కేటాయించారు.హత్యాచార దోషి సంజయ్కు ఉరిశిక్ష సరైనదని CBI లాయర్ వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ IPS కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని CBI లాయర్ వాదించారు.అతడిని ఉరి తీయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోల్కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయు మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్నూ రావద్దని కోరినట్లు తెలిపారు.తాను తప్పు చేయలేదని కలకత్తా హత్యాచార ఘటన దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తీర్పు ఖరారుపై కాసేపటి క్రితం సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. కాగా 2024 AUG 9న RG Kar ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైంది. ఆ మరుసటి రోజు మాజీ పోలీస్ కాంట్రాక్టు ఉద్యోగి సంజయ్ ఈ కేసులో అరెస్టయ్యాడు.