Vikarabad collector incident accused arrest: వికారాబాద్ కలెక్టర్ దాడిలో ఎవ్వర్ని వదిలి పెట్టం
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడిలో ఉన్న ఏ ఒక్కరిని వదిలి పెట్టం అన్న sp సత్యనారాయణ.
ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగింది. కలెక్టర్ ప్రతీక్ జైన్పై పై ఓ మహిళ చేయి చేసుకుంది. వికారాబాద్ జిల్ల కలెక్టర్,తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు. వారి అభ్యంతరంతో గ్రామానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మార్వోపై రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. బోగమోని సురేశ్ అనే వ్యక్తి అధికారులపై దాడికి ప్లాన్ చేశాడని తెలిపారు. కొందరిని అతడే గ్రామానికి తీసుకెళ్లి రాళ్లు, కర్రలతో కొట్టించాడని చెప్పారు.
ఇందులో పాల్గొన్న వారిని వీడియోల ద్వారా గుర్తించామని, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో కుట్రకోణం ఉన్నట్లు SP నారాయణరెడ్డి తెలిపారు. సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్, అధికారులను తప్పుదోవ పట్టించి గ్రామంలోకి తీసుకెళ్లి దాడి చేయించారన్నారు. హైదరాబాద్లోని మణికొండకు చెందిన అతడిని BRS కార్యకర్తగా గుర్తించినట్లు చెప్పారు. దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 28మందిని అరెస్టు చేశారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్ధరాత్రి 28 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి PSకు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిన్న ఫార్మా పరిశ్రమకు భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని ట్వీట్ చేశారు.