TG Rythu Barosa amount release date announced : రైతు భరోసా నిధులు విడుదల అప్పుడే 2024

Photo of author

By Admin

TG Rythu Barosa amount release date announced : రైతు భరోసా నిధులు విడుదల అప్పుడే…

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేస్తాం అని దానిపై క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఇస్తామని తెలిసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ నిధులను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహలు చేస్తుంది ఇప్పటికే నిధులను సమకూర్చే పనులు పడింది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావచ్చును నేపథ్యంలో స్వర్ణోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ స్వర్ణ ఉత్సవాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసానిధులను విడుదల చేయాలని ఆలోచన చేస్తూ ఉంది.

ఇప్పటికే రైతులకు రెండు లక్షల రుణమాఫీని దశలవారీగా అయితే విడుదల చేసింది మూడు దశలో చాలామంది రైతులకు కాకపోవడంతో వారికి కూడా ఇప్పుడు రుణమాఫీ చేసే పనిలో పడింది 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో వారికి మూడు దశల్లో రుణమాఫీ కాలేదు వారికి కూడా ఇప్పుడు రుణమాఫీ చేసే ఆలోచన చేస్తోంది దేనికి గాను మొత్తంగా 1000 కోట్ల వరకు మళ్లీ ఖర్చయ్య అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే వరి పండించినందుకు గాను 500 రూపాయల బోనస్ను ఇవ్వడానికి 1000 కోట్లను మొదటి దశలో అయితే విడుదల చేసింది.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసాను మొదటి దశ విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి 7-8 ఎకరాల వరకు డిసెంబర్ ఆఖరుకు రైతు భరోసా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల కోట్ల నిధులను దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు 1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో జమ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ఎట్ల కీలక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయనున్న 7500 రూపాయలను డిసెంబర్ 9 లోగా రైతుల ఖాతాలో జెమ్ చేస్తామని తెలుపడం జరిగింది.

Leave a Comment