Vallabhaneni Vamshi Arrest in Andhra Pradesh : వల్లభనేని వంశీని HYDలో అరెస్ట్

Vallabhaneni Vamshi Arrest in Andhra Pradesh

వల్లభనేని వంశీని HYDలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం TDP ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు.

రైతు ప్రస్థానం : వల్లభనేని వంశీని HYDలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం TDP ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.గన్నవరం మాజీ ఎమ్మెల్యే, YCP నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. అలాగే BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు.

Leave a Comment