TS govt will be cutting the rythu bharosa: సర్వే ముసుగులో రైతులకు కొత్త విదించనున్న ప్రభుత్వం
త్వరలో అందించబోయే రైతు భరోసా పై రైతులకు కోత విధించనుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సర్వేను నిర్వహిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కోత విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు ఆర్థిక సహాయం చేయడం కోసం తీసుకొచ్చిన పథకం ఇది ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో 8000 రూపాయలను ఎకరాకు ఇస్తూ వచ్చింది రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 10000 ఎకరాకు ఇస్తూ వచ్చింది.
ఇప్పుడు ఎలక్షన్ హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామంటూ అధికారంలోకి రావడం జరిగింది కానీ ఇంతవరకు ఒక పంట ఇంటికి వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వం రైతులకు రైతు భరోసా విడుదల చేయలేదు అంతేకాకుండా ఇప్పటికీ మార్గదర్శకాలు తయారు కాలేదు అంటూ బొంకుతూ వస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పై అలాగే రైతు భరోసా పై ఎలాంటి వివరణ లేకుండా నేరుగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను అయితే నిర్వహిస్తోంది ఈ సర్వే రైతులకు ఎంతో కొంత కోతపట్టే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు అసలు రైతులకు ఈ సర్వే ద్వారా ఎందుకు కోత పడుతుందో తెలుసుకుందాం..
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న ఈ సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా రైతులు తమ యొక్క సామాజిక మరియు భూమి నే పద్యాలు రాజకీయ నేపథ్యాల గురించి తెలియజేయవలసి ఉంటుంది కచ్చితంగా రైతు భూమి వివరాలను సర్వేర్ కు ఇచ్చినట్లయితే తనకు ఎంత మోతాదులో భూమి ఉంది అనేది ప్రభుత్వానికి ఇట్టే తెలిసిపోతుంది దీని ద్వారా ప్రభుత్వం తీసుకువచ్చే ఆంక్షలు కారణంగా రైతులకు కోతపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రైతు భరోసా కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7.5 ఎకరాల వరకే రైతు భరోసా కావాలి అని ఎక్కువ మోతాదులో రైతులు ఆబ్జెక్షన్ పెట్టినట్టు సమాచారం కొంతమంది రైతును మాత్రమే పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం ఒకవేళ ఆ రైతుకు పది ఎకరాలకు మించి భూమి ఉన్నట్లయితే ఆ రైతుకు రైతు భరోసా కట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది అలాగే రేషన్ కార్డు కూడా వస్తుందా రాదా అనేది ఒక క్యూస్షన్ మార్క్ గా మిగిలిపోతుంది.
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డును ఇవ్వాలి అంటే 7.5 ఎకరాల వరకు భూమి ఉంటే తప్ప రేషన్ కార్డు ఇవ్వమని తెలిపింది ఒకవేళ 7.5 ఎకరాలకు పైబడి రైతులకు భూమి ఉన్నట్లయితే వారికి రేషన్ కార్డు ఇక ఉండనట్లే.10 ఎకరాల లోపు ఉన్న చిన్న , సన్నకారు రైతులను గుర్తించి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. తద్వారా అసలైన అర్హులకు పంట సాయం అందడంతోపాటు ప్రభుత్వ ఖర్చు వృథా అవ్వదు అనేది కాంగ్రెస్ నాయకుల మాట ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాలి అనే లక్ష్యంతో ఈ సర్వేను నిర్వహిస్తున్నాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.
ఆరు గ్యారెంటీల అమలుకు సర్వే సహాయపడుతుంది అలాగే కొంతమంది రైతులకు కోతలు విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది అనర్హులు కూడా అర్హులుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకు గండి కొడుతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. గత ప్రభుత్వం వెంచర్లు రియల్ ఎస్టేట్ రాళ్లు రప్పలు రోడ్లకు రైతు బంధు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సర్వే ద్వారా ఆ చిక్కుముడి వీడనున్నట్లు సమాచారం.