TGPSC Group 1 Topper kommireddy Lakshmi Dipika
మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుని టాపర్ గా నిలిచింది హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక.
MBBS కంప్లీట్ చేసి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయింది.దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్ లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి పద్మావతి గృహిణి పదో తరగతి వరకూ సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో చదివిన లక్ష్మీదీపిక 2013లో మెడిసిన్ చదవి 119వర్యాంకు సాధించింది. ఆ తరువాత ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలని అనుకున్నప్పటికీ యూపీఎస్సీ మెరుగైన ఎంపిక అనుకుని అటు వైపుగా సాగింది. 2023లో బయో ఫెర్టిలైజర్స్ తయారుచేసే అంకుర సంస్థలో జాబ్ చేసింది. ఆ తర్వాత ఆ జాబ్ మానేసి 2024 జనవరి నుంచి పరీక్షల మీదే పూర్తి దృష్టి పెట్టింది. రోజుకూ 8 గంటల నుంచి 10 గంటల వరకూ చదివేదాన్ననని తెలిపింది.