HCUలో ఉద్రక్త వాతావరణం భూమి తమదే అన్న ప్రభుత్వం | HCU students Protest Against TG Govt 2025

HCU students Protest Against TG Govt 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వం భూమి చదును పనులు కొనసాగిస్తోంది. పోలీసు బందోబస్తుతో నిన్న రాత్రి నుంచి నిరంతరాయంగా చెట్లను తొలగిస్తూ పనులు చేస్తున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వం భూమి చదును పనులు కొనసాగిస్తోంది. పోలీసు బందోబస్తుతో నిన్న రాత్రి నుంచి నిరంతరాయంగా చెట్లను తొలగిస్తూ పనులు చేస్తున్నారు. అటువైపు విద్యార్థులు రాకుండా అడ్డుకుంటున్నారు. కాగా చెట్లను తొలగించడం వల్ల బయో డైవర్సిటీ దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భూమి ప్రభుత్వానిదే

భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.

బండి సంజయ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘మీకు మానవత్వం లేదా? నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను బాదటం ఎంతవరకు సమంజసం. హెచ్సీయూ భూములను రక్షించేందుకు విద్యార్థులు పోరాడుతుంటే, వారిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం దారుణం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్య బట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.

Leave a Comment