TG Free Sand For Indiramma Housing Scheme:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.ఇందిరమ్మ ఇండ్లకు కావలసిన ఇసుకను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీరుగా ఉచితంగా ఇసుకను సప్లై చేయడానికి గ్రీన్ సిగ్నల్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను సంక్రాంతి తర్వాత అమలు చేయడానికి ఇప్పటికే ప్రాసెస్ మొదలుపెట్టింది మొదటగా సొంత జాగా ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది.
ఇందిరమ్మ ఇళ్ళను కట్టుకునే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులైన వారికి ఇండ్లను కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు ఇసుకను ఉచితంగా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది న్యూ ఇయర్ కానుకగా అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ఇసుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా అయితే అందించనున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులైన వారికి ఇళ్లను కట్టుకోవడం కోసం ఉచితంగా ఇసుకను సరఫరా చేయనుంది. దీనివల్ల అధిక భారం దగ్గర ఉన్నది. ఒక ట్రిప్పు ఇసుక 1400 నుంచి 1500 వరకు పలుకుతున్న నేపథ్యంలో ఇందులో కట్టుకునే వారికి ఉచితంగా అందిస్తే వారికి సహాయ పడగ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సిమెంట్, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, స్థలం లేని వారికి స్థలం+రూ.5లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.సొంతంగా స్థలం లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు దశలో ఐదు లక్షల రూపాయలను అందించనుంది.కొన్నిచోట్ల స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్లను ఇందులో మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.