Telangana Rythu Bharosa Latest News 2025: రైతు భరోసా కోసం మళ్లీ రైతుల నుంచి అప్లికేషన్లు
రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే మళ్లీ వాయిదా పడేనా
అసెంబ్లీలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తా మన సీఎం
మార్గదర్శకాల కోసం మరోసారి వెయిటింగ్ కావాలన్న డిప్యూటీ సీఎం
ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని దానిపై సందిగ్ధం
రైతూ ప్రస్థానం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడం కోసం సన్నాహాలు చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా అందజేస్తాం అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే పనులను వేగవంతం చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీకి సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతు భరోసా కోసం మళ్లీ రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇందు కోసం ప్రత్యేక వెబ్ సైట్ లాగ యాప్ రూపొందించనుంది. దీనిలో సాగు వివరాలతో పాటు రైతుల భూమి ఇప్పుడు సాగులో ఉందా లేదా పాడుబడి ఉందా అనేదాని గురించి సమాచారం ఉంటుంది.రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్‌కమిటీ గంటన్నరపాటు చర్చించింది.
సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని మంత్రి వర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. ఒకవేళ భూమి సాగులో ఉన్నట్లయితే దానికి సంబంధించి ఫోటోలను అప్ ల అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రైతు భరోసా కు సంబంధించి మార్గదర్శకాలను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన మొలకలు అయితే అవుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను అయితే ఖరారు చేయలేదు ఇంతకుముందే రైతు భరోసా కు సంబంధించి రైతు వేదికల ద్వారా రైతుల నుంచి సూచనలు తీసుకున్నారు అయినా వాటిని ఫైనల్ చేయకుండా ఇప్పుడు పీఎం కిసాన్ కు సంబంధించి విధివిధానాలను పరిశీలించారు దాంట్లోనే టాక్స్ చెల్లించే వారికి ఉద్యోగులకు రైతు భరోసా కల్పించేది లేదని సూచనప్రాయంగా అయితే తెలిపారు.
ఇప్పటికే రైతు భరోసాను విడుదల చేయడానికి డేట్ నూ ఫిక్చే చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఎలా విడుదల చేయాలనే దానిపై స్పీడ్ పెంచింది. మార్గదర్శకల తుది జాబితా విడుదల చేయడం కోసం మరోసారి ఈ సమావేశం అవ్వాలని బట్టి విక్రమార్క తెలిపారు.ఇక సాగు భూమి లెక్క తేల్చేందుకు గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. ఇదంతా జరగటానికి మరింత సమయం పట్టే అవకాశంఉండటంతో సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.