Telangana Revenue divided: రెండు విభాగాలుగా విడిపోనున్న రెవిన్యూ శాఖ-2024

Photo of author

By Admin

Telangana Revenue divided : రెండు విభాగాలుగా విడిపోనున్న రెవిన్యూ శాఖ

రెవిన్యూ శాఖను రెండు విధాలుగా విభజించి భూ సమస్యలకు పరిష్కారం చేయాలని పలువురు రెవెన్యూ అధికారులు అయితే కోరుతూ ఉన్నారు వారికి సంబంధించి ఇప్పటికే రెండు శాఖలకు రెండు శాఖలు విభజించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో రెండు విధాలుగా విభజించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆలోచిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో సంప్రదింపులు జరిగినట్టు తలుస్తోంది. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖను రెండు భాగాలుగా విభజించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమైతే చూపనుంది.సాధారణ పాలన, భూపరిపాలన అనే వేర్వేరు విభాగాలుగా విడగొట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

రెవెన్యూ శాఖపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం ఉండడం వల్ల ఆ శాఖను రెండు విభాగాలుగా విభజించి పారదర్శకతకు పెద్ద పీట వేయచ్చు అనే వాదనలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి రెవెన్యూ శాఖకు అనుబంధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఆడ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ధ్రువపత్రాల జారీ , సంక్షేమ పథకాల అమలు, ప్రోటోకాల్ కార్యక్రమాలను రెవిన్యూ శాఖ సాధారణ పాలనలో ఆడ్ చేయడం ద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయని వస్తున్న సూచనలు ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఇలా చేయడం ద్వారా చాలా సంఖ్యలో భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు రెవిన రెవిన్యూ భాగంపై చాలా వరకు ఒత్తిడి తగ్గించిన వారిని అవుతామని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీనికి ఎప్పటికి కొంతమంది రెవెన్యూ అధికారులు మద్దతు పలికారు.మండల తహసీల్దారు కార్యాలయంలో భూసంబంధిత పాలనకు ఒక అధికారిని, అభివృద్ధి, సంక్షేమం ఇతర కార్యక్రమాలకు మరో అధికారిని కేటాయించడం ద్వారా ఇద్దరు తహసీల్దార్లతో మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు.. ఆర్‌ఐ నుంచి ఆర్డీవో వరకు.. ఎన్నికలు వచ్చినా, విపత్తులు, జనాభా లెక్కలు, తనిఖీలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రొటోకాల్‌.. ఇలా అన్నీ రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే జరుగుతున్నాయి.

దీంతో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, సేవలు ఆలస్యమవుతున్నాయనే విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ విభాగాల మధ్య నేటికీ సమన్వయం లేదు. రెవెన్యూలో మ్యుటేషన్‌ పెండింగ్‌ ఉన్నా రిజిస్ట్రేషన్‌ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల కొన్ని కేసుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. ఉన్నత స్థాయిలోనూ రెవెన్యూకు, రిజిస్ట్రేషన్‌ విభాగాలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉన్నారు. అవసరం లేకపోయినా ఇది కొనసాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. కాగా.. 2014లో ప్రపంచ బ్యాంకు ల్యాండ్‌ గవర్నెన్స్‌ అసె్‌సమెంట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కింద నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల్లో.. భూపాలన కోసం, భూదస్త్రాల నిర్వహణకు ఏకీకృత భూపరిపాలనా వ్యవస్థను తీసుకురావాలని పేర్కొంది. ఈ ఆలోచన అందుబాటులోకి వస్తే దాదాపు హో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చాలామంది అధికారులు అయితే అంటూ ఉన్నారు. అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు తక్కువ సమయంలో ముగించవచ్చు అని రెవెన్యూ అధికారుల ఆలోచన.

Leave a Comment