Telangana New Ration Card Applications
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఐతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనేప్రజా పాలనా ద్వారా అప్లికేషన్స్ ను తీసుకుంది అప్పుడు కథ రేషన్ కార్డులకు ఒక నిర్దిష్టమైన అప్లికేషన్ లేకుండా కేవలం తెల్ల కాగితం మీద వివరాలను రాసి అక్కడ కౌంటర్లో ఇస్తేయ్ సరిపోతుంది అన్న రాష్ట్ర ప్రభుత్వం మల్లి మీ సేవ ద్వారా కొన్ని అప్లికేషన్స్ తీసుకుంది వాటికి రాష్ట్రం సర్వేలు జరిపి కుల గణన ఆధారంగా రేషన్ కార్డులను ఇవ్వడానికి చూస్తుంది.ఐతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నాం అని కొందరు విస్తృత ప్రచారం చేయడంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది. పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలని మీసేవ నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది.ఎవరైతే ప్రజాపాలన ద్వారా తమ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేయలేదో వారు మీ సేవ సెంటర్ కి వెళ్లి అక్కడ 50 రూపాయలు మాత్రమే ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి అని పౌరసరఫరాల శాఖా తెలిపించి.