Telangana CM to meet Defence Minister: మూసీ పునరుజ్జీవంలో భాగంగా 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా సీఎం 

Photo of author

By Admin

Telangana CM to meet Defence Minister మూసీ పునరుజ్జీవంలో భాగంగా 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా సీఎం

Rajnad Sing And Revanth Reddy
Rajnad Sing And Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని విజ్ఞప్తి చేశారు.

Telangana CM to meet Defence Minister
Telangana CM to meet Defence Minister

మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటిచెప్పే కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ప్రాజెక్టు వివరాలను కేంద్ర మంత్రికి సీఎం గారు తెలియజేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామసహాయం రఘురాం రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, కుందూరు రఘువీర్ గారు తదితరులతో కలిసి సీఎం గారు ఢిల్లీలో రక్షణ మంత్రి గారిని కలిశారు.

బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (Statue of Peace), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని సీఎం వివ‌రించారు. ఇందుకోసం ర‌క్ష‌ణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave a Comment