Revanth Reddy Orders to collectors grain purch: రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు 2024

Photo of author

By Admin

Revanth Reddy Orders to collectors grain purch : రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సన్న రకాలపై ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 విషయంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో భరోసా కల్పించాలని చెప్పారు.రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. సన్నరకాలకు తెలంగాణలో బోనస్ అందిస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని, అలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్‌చార్జి మంత్రులు, ఇన్‌చార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తూ రోజూవారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్న సందర్భంగా 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ఆ సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Leave a Comment