Telangana Cabinet meeting highlights: క్యాబినెట్ నిర్ణయాల్లో లేని ఉద్యోగుల DA
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం పొందరా పలు కీలక విషయాలు ఇవే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నా చేయడంతో అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పరిష్కారాలు అయితే కనుగొంది అలాగే కొన్ని రెవెన్యూ నియోజకవర్గాలను డివిజన్లను కూడా ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకానమీ పెరిగే అవకాశం ఉన్నట్లు సీఎం ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. క్యాబినెట్లో జరిగిన సమావేశంలో సిఎంఎవంత్ రెడ్డి తో సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తో ఈ సభ జరగడం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ములుగులో రాష్ట్ర కొత్త యూనివర్సిటీ ని నిర్మించబోతున్న విషయం తెలిసింది ఆ యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ వర్సిటిగా నామకరణం చేయడం జరిగింది. దీనికి భూములను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే భూములు కేటాయించాలని నిర్ణయించారు.మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు.హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రతి తక్కువగా ఉండటం వల్ల ఆ పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏటూరు నాగారంను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటుకు ఆమోదించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ అయినా 500 బోనస్ ఇవ్వడానికి నిర్ణయాలు అయితే తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి రియల్ ఎస్టేట్ పడిపోయిన విషయం తెలిసింది.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమ పరిదీపించుకోవడం కోసం రేరాలో 4 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ఉస్మానియా ఆసుపత్రికి సన్మానించి కొత్త నిర్మాణాన్ని చేయాలంటూ ఆలోచన చేసిన విషయం తెలిసింది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ భూమినీ ఉస్మానియా ఆసుపత్రి బదలాయింపునకు క్యాబినెట్ భేటీలో మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం వల్ల ప్రజలు ఎంతో కొంత సంతోషపడతారని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు జరిగిన బ్యూటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని గురించి ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి నుంచి ఈ నిధులను విడుదల చేస్తామని ఇప్పటికీ రైతులకు తెలపడం జరిగింది. అసలు ఈ నిధులను విడుదల చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన మార్క్ గా ఇప్పుడు రైతుల్లో మిగిలిపోయింది.