RGV Audio Viral 2024: వైరల్ అవుతున్న RGV ఆడియో
కొండా సురేఖ చేసిన వాక్యాలకు స్పందిస్తూ డైరెక్టర్ rgv చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
RGV Audio Viral 2024
తెలంగాణా రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ చైతు సమంత పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ వివాదాస్పద “డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఆమె అక్కడ సమంతను పొగిడింది తప్ప కించ పరచలేదు.అక్కడ అవమానానికి గురైంది మాత్రం అక్కినేని కుటుంభం.”అక్కినేని కుటుంబాన్ని ఇంత దారుణంగా అవమానించడం” నేను ఇంత వరకు ఎప్పుడు చూడలేదు ఈ విషయాన్ని అంత తేలికగా వదిలి పెట్టొద్దు. గట్టిగ స్ట్రోనగ మనం అంటే ఏంటో చూపించాలి.ఇంకోసారి ఇండ్రస్టీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయాలి అనుటు ఆయన ఆ ఆడియోలో తెలుపడం జరిగింది.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే చాల మంది హీరోలు మరియు హీరోయిన్లు ప్రతి స్పందిస్తూ ట్వీట్స్ చేశారు.ఒక సాటి మహిళా ఇంకో మహిళను ఇంత ఘోరంగా అవమానించడం చాలా నేరం ఘోరం అని అంటున్నారు.అటు ప్రతి పక్ష నేతలు తమకు భహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరుతూ ట్వీట్స్ మరియు న్యూస్ లో చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామ రావు పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆయన కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు.మాకు బహిరంగ క్షమాపణ చెప్పక పొతే పరువు నష్టం దావా వేస్తాను అని అన్నారు.రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా పరువు తీయాలని చూస్తున్నారు అంటూ ఆయన స్ లో రాసుకొచ్చారు. ౨౪ గంట్లల్లోగా క్షమాపణ చెప్పక పొతే పరువు నష్టం దావా వేస్తాను అని అన్నారు.

ఈ విషయం పై స్పందించిన పలువురు సినీ వర్గాలు రాజాకీయ శత్రువులను ఎదుర్కోవడం కోసం సినీమా ఇండ్రస్టీ వాళ్ళను పాముల్లా వాడుకోవడం ఎం బాగులేదని అన్నారు. అస్సలు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు అని పాలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
రవి తేజ
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక వ్యూహాలును అవలంభిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు ఇది అవమానించడం కంటే ఎక్కువ మీ రాజకీయ శతృత్వాల్లోకి అమాయకమైన వ్యక్తులను ముఖ్యంగా మహిళలను ఎవరు లాగాకూడదు,నాయకులూ సామజిక విలువలను పెంచాలి తెప్ప వాటికి భంగం కలిగించ కూడదు అంటూ ఫైర్ అయ్యారు.

మంత్రి కొద సురేఖ ఈ విషయమై కుట్ర పై తగ్గే ప్రసక్తే లేదు అని అన్నారు.చైతు విడాకుల పై మాట్లాడడం తప్పే కానీ నాకు ఇంటర్నల్ గా వచ్చిన సమాచారనే నేను మాట్లాడానని అన్నారు.
కొందరు కొండా సురేఖ మాట్లాడింది తప్పు అంటున్నారు మరికొండారు సమంతాను పొగిడింది తప్ప అవమాన పరచలేదు అని అంటున్నారు కానీ అక్కినేని ఫ్యామిలీని మాత్రం ఘోరంగా అవమానించారు అని అంటుంటారు సినీ వర్గాలు.రాజకీయ వర్గాలు మాత్రం మాకు భారంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు.ఆమె అన్నదాంట్లో తప్పేంటి అని అధికార పక్ష వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.ఈ విషయం పై అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం కెసిఆర్ నోరు విప్పలేదు.