RCB Team New Captain Announced Franchise owner: RCB కొత్త కెప్టెన్ గా రజత్ ట్రోఫీ గెలిచేనా 2025

RCB Team New Captain Announced Franchise owner

IPL-2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

IPL-2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ‘నాతో పాటు జట్టు సభ్యులందరం మీవెంటే ఉంటాం. ఈ ఫ్రాంచైజీలో మీరు ఎదిగిన విధానం, మీరు ప్రదర్శించిన తీరుతో RCB అభిమానులందరి గుండెల్లో స్థానం సంపాదించారు. దీనికి మీరు అర్హులు’ అని కోహ్లి చెప్పారు. కెప్టెన్ మార్పుతో RCB కప్ గెలిచేనా రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఈ సీజన్లో తమ సారథిగా రజత్ పాటిదార్ పేరును RCB ప్రకటించింది. విరాట్ కోహ్లి పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగినా యాజమాన్యం రజత్ పేరును ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. పాటిదార్ 2021 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్నారు. మొత్తం 54 మ్యాచుల్లో 1598 రన్స్ చేశారు. కొత్త కెప్టెన్ నాయకత్వంలోనైనా ఆర్సీబీ కప్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Leave a Comment